(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (మనీ అస్ట్రాలజీ) | నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. అక్టోబర్12వ తేదీ బుధవారం నాడు మనీ ఆస్ట్రాలజీ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్వని, భరణి, కృత్తిక-1) : ఈ రోజు మీ పని ప్రభావం పెరుగుతుంది. పరిపాలనా పనులు వేగవంతం అవుతాయి. పరిశ్రమ, వ్యాపారంలో ఈ రోజు విజయం వరిస్తుంది. లాభం వచ్చే శాతం స్థిరంగా ఉంటుంది. చక్కటి ఆఫర్స్ వస్తాయి. పనిపైన శ్రద్ధ పెంచండి. సానుకూలత వల్ల విజయం మీకు తోడవుతుంది. అనుభవాన్ని మీరు ఈ రోజు సద్వినియోగం చేసుకుంటారు. పరిహారం: పరమ శివుడికి నీటితో అభిషేకం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) :అదృష్ట శక్తి వల్ల మీ పనులన్నీ విజయవంతమవుతాయి. ఆఫీసులో మీరు ఈ రోజు విశేషమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఊపు ఉంటుంది. ప్రయోజనకరమైన పథకాలు ముందుకు తీసుకెళ్తాయి. ప్రతి ఒక్కరికీ సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వారు వాటిని సద్వినియోగం చేసుకుంటారు. పరిహారం: భైరవ ఆలయంలో కొబ్బరికాయ కొట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : వ్యాపారంలో అజ్రాగత్త అసలు వహించకూడదు. ఆర్థిక విషయాలపైన మరింత శ్రద్ధ పెట్టండి అప్పుడే లాభం వస్తుంది లేదంటే నష్టమే వస్తుంది. ఆఫీసులో మీకు మీ తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పరిశోధన కార్యకలాపాల్లో మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు ఉదార భావాన్ని కలిగి ఉంటారు. మొత్తం కుటుంబంతో ఆత్మీయంగా దగ్గరగా ఉంటారు. పరిహారం: సూర్యుడికి నీళ్లు సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ముఖ్యమైన విషయాల్లో ఈ రోజు మీరు విజయం సాధిస్తారు. దంపతులు సంతోషంగా ఉంటారు. పారిశ్రామిక వ్యవహారాల్లో లాభాలు వస్తాయి. పరిశ్రమ లక్ష్యాలను సాధించడానికి అవసరమయ్యే ప్రయత్నాలు జరుగుతాయి. లక్ష్యం పట్ల అంకితభావంతో పని చేయాలి. పరిహారం: ఆవులకు సేవ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. ఉద్యోగులు చక్కటి ప్రదర్శన కనబరుస్తారు. సానుకూల దృక్పథంతో పనులు సాగుతాయి. క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. నియమ నిబంధనలు పాటిస్తారు. వృత్తి నైపుణ్యం, కష్టపడేతత్వంతో మీకు స్థానం లభిస్తుంది. ఏ విషయంలోనూ టెంప్ట్ కాకూడదు. అనవసర జోక్యాలు చేసుకోకూడదు. పరిహారం: పసుపుతో చేసిన తినుబండారాలను దానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : మేధో ప్రయత్నాలు ఉత్తమంగా ఉంటాయి. విధాన నియమ నిబంధనలు పాటిస్తారు. ఆర్థిక విషయాలు మీకు సానుకూలంగా ఉంటాయి. ఆత్మీయ స్నేహితులను ఈ రోజు మీరు కలుస్తారు. స్నేహితులతో కలిసి అలా సరదాగా విహారయాత్రకు వెళ్తారు. లాభం వచ్చే అవకాశాలు అలానే ఉంటాయి. ముఖ్యమైన విషయాలపైనే ఆసక్తి చూపుతారు. బోధించే ముందు అధ్యయనం చేయడం ప్రభావవంతంగా ఉంటుంది. పరిహారం: కృష్ణుడి ఆలయానికి వేణువును సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : రక్త సంబంధాలు బలపడుతాయి. కుటుంబం శుభ ప్రదంగా ఉంటుంది. సంప్రదాయాలను అనుసరిస్తారు. భవన, వాహన సంబంధిత విషయాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. అత్యుత్సాహం పక్కనబెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సామరస్యాన్ని కాపాడతారు. వ్యక్తిగత ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) :సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి కలుగుతుంది. వాణిజ్య విషయాలపైనే శ్రద్ధ ఉంటుంది. సహకారం పెరుగుతుంది. వివిధ విషయాలను మీరు నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తారు. చక్కటి సమాచారం అందుతుంది. వ్యాపారంలో పెరుగుదల కొనసాగుతుంది. పరిహారం: భోళా శంకరుడికి పంచామృతంతో అభిషేకం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : మంగళకరమైన కార్యాలలో చేరే అవకాశాలుంటాయి. ఆఫీసులో కాంటాక్ట్స్ పెంచుకోవడంతో పాటు సోషల్ ఇంటరాక్షన్ పెంచుకోవడంపై ఆసక్తి పెరుగుతుంది. రక్త సంబంధాలు బలంగా ఉంటాయి. చక్కటి సమాచారం అందుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కదలిక ఉంటుంది. గొప్పతనం, అలంకరణ అలాగే ఉంటుంది. వేగం అలాగే కలిగి ఉంటారు. పరిహారం: పెద్దల ఆశీస్సులు పొందాక ఇంటి నుంచి బయటకు వెళ్లండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) :ఈ రోజు కొత్త ప్రారంభం జరగవచ్చు. ముఖ్యమైన సృజనాత్మక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. లాభం వచ్చే శాతం ఎక్కువగా ఉంటుంది. సానుకూలతో ఉత్సాహంగా ఉండాలి. సున్నితత్వాన్ని కాపాడుకోవాలి. వ్యక్తిగత విషయాలు మెరుగవుతాయి. సంకోచం తొలగిపోతుంది. పని వల్ల వ్యాపారం మెరుగవుతుంది. పరిహారం: ఓం నమ:శివాయ అని 108 సార్లు జపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) :పని నెమ్మదిగా ఉండవచ్చు. సంబంధాలు ఉత్తమంగా ఉంటాయి. ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. త్యాగం, సహకార స్ఫూర్తి పెరుగుతుంది. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. నిర్వహణలో సుఖంగా ఉంటారు. బడ్జెట్ ప్రకారమే ముందుకెళ్తారు. విదేశీ పనిలో కదలిక వస్తుంది. విధానం అనుసరిస్తారు. పరిహారం: రామ్ రక్షా స్తోత్ర పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : విజయం వచ్చే శాతం అలానే పెరుగుతుంది. వ్యాపారంపైన శ్రద్ధ వహిస్తారు. ప్రతి ఒక్కరినీ మీ వెంట తీసుకెళ్తారు. పోటీతత్వం ఉన్న భావాన్ని కలిగి ఉంటారు. చక్కటి ప్రదర్శన కనబరుస్తారు. వ్యాపారంలో వేగం పెరుగుతుంది. అత్యవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. పరిహారం: హనుమంతుడికి నెయ్యి దీపం వెలిగించండి. ప్రతీకాత్మక చిత్రం)