(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశుల వారి వ్యాపారం, ఉద్యోగం తో పాటు ఆర్థిక పరిస్థితులను జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తుంటారు. డిసెంబర్ 2వ తేదీన (మార్గశిర శుద్ద నవమి) శుక్రవారం నాడు వివిధ రాశుల వారికి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఒత్తిడి ఉంటుంది. దాన్ని తగ్గించుకోడానికి మీరు చిన్న ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అందువల్ల ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు కొంచెం పరధ్యానంగా ఉండవచ్చు. పరిహారం: ఆవ నూనె రాసుకుని నల్ల కుక్కకు బ్రెడ్ పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం పొందుతారు. ఇంట్లో శుభ కార్యాల గురించి చర్చించుకోవచ్చు. అపరిచిత వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వారి సలహాతో పెట్టుబడి పెట్టకండి . నష్ట పోయే ప్రమాదముంది. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశి (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : కొత్త ప్రాజెక్ట్‌లో పనులు ప్రారంభించవచ్చు. స్థిరాస్తి విషయంలో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. పనికి సంబంధించిన అన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. పరిహారం: మర్రిచెట్టు కింద నేతితో దీపం వెలిగించండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహ రాశి (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రోజు మీరు చాలా చురుకుగా ఉంటారు. కుటుంబంలో శాంతి, స్థిరత్వంతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఆర్థిక పరంగా ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. రోజంతా లాభాలు పొందే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పరిహారం: సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా 7 సార్లు పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య రాశి (Virgo) య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : ప్రియమైన వ్యక్తి కోసం కొంత డబ్బు సిద్ధం చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఆందోళన వాతావరణం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాల్సిన రోజు. వ్యాపారంలో పెద్దగా రిస్క్ తీసుకోకండి. నష్టపోయే అవకాశం ఉంది. పరిహారం: బోనులో ఉన్న పక్షుల్ని విడిపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : తొందరపాటు పనికిరాదు. అలాంటి ప్రవర్తన వల్ల మీ వ్యాపారానికి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. వాతావరణ మార్పు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దీని కారణంగా మీ వ్యాపారంలో పనులు ఆలస్యం కావచ్చు. పరిహారం: పేదలకు చదువు చెప్పండి.(ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) :ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రిస్క్ తీసుకుంటే లాభాలు వస్తాయి. సహనం, మృదువైన ప్రవర్తనను పెంచుకోవడం ద్వారా సమస్యలను సరిదిద్దవచ్చు. బాధలో ఉన్నవారికి సహాయం చేసే అవకాశం లభిస్తుంది. పరిహారం: తల్లికి తీపి వస్తువులు ఇవ్వండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : మీరు సామరస్యంగా పని చేస్తే ఊహించని లాభం పొందుతారు. మీ బడ్జెట్‌పై దృష్టి పెట్టండి. అనవసరమైన ఖర్చులు చేయకండి. ముఖ్యమైన నిర్ణయాలను పెండింగ్‌లో ఉంచొద్దు. శ్రేయోభిలాషుల సలహాలను గౌరవిస్తారు. ఆర్థిక విషయాల్లో క్రియాశీలత తీసుకువస్తారు. పరిహారం: వినాయకుడికి గరిక సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభ రాశి (Aquarius) (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : అందరితోనూ సమన్వయంతో ఉంటారు. నాయకత్వం, నిర్వహణ మెరుగవుతుంది. రిస్క్ తీసుకోవాలనే ఆలోచన మీ వ్యాపార లాభాల్ని పెంచుతుంది. అదృష్టం బలంగా ఉంటుంది. మీ ప్రణాళిక వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళుతుంది. లాభం పెరుగుతుంది. పరిహారం: గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వ్యాపారంలో లాభాలు బాగానే ఉంటాయి. మీ వ్యాపారంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కృషి, అంకిత భావంతో కార్యాలయంలో మీ స్థానాన్ని కాపాడుకుంటారు. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి లేకుంటే ధన నష్టం తప్పదు. పరిహారం: హనుమంతునికి కొబ్బరికాయ కొట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)