(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశుల రోజువారీ ఆర్థిక వ్యవహారాలను జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. జనవరి 13, 2023 తేదీ శుక్రవారం నాడు వివిధ రాశుల వారికి ధన జ్యోతిష్య ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి.
మేష రాశి (Aries) : ఉద్యోగులు ఆర్థిక అవసరాలపై బడ్జెట్ పెట్టుకుని పనిచేస్తారు. ఖర్చుపై నియంత్రణ పెంచుకోండి. లేకపోతే రుణం తీసుకోవలసి రావచ్చు. పెట్టుబడి, విస్తరణ పనులలో తలమునకలై ఉంటారు. వ్యాపారుల మధ్య పాత లీగల్ మ్యాటర్స్ బయటపడే అవకాశం ఉంది. సహనం ప్రదర్శిస్తారు. వ్యాపార సంబంధ ఆర్థిక విషయాలు పెరుగుతాయి. పరిహారం : శివలింగానికి నీటిని సమర్పించండి.
కర్కాటక రాశి (Cancer) : యువత కెరీర్‌కు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలో చాలా బిజీగా గడుపుతారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, దాని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఒక తప్పుడు నిర్ణయం మీ లాభాన్ని నష్టంగా మార్చగలదు. పరిహారం : పసుపు వస్తువులను దానం చేయండి.