(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. సెప్టెంబర్ 9వ తేదీ శుక్రవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఆర్థిక వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజీ, వినయంతో కష్టమైన విషయాలను పరిష్కరించవచ్చు. సాధారణ పని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అప్పు తీసుకోవడానికి మీరు మీ మనసు మార్చుకోవచ్చు. మీ పెద్ద కష్టాలు కూడా ముగియవచ్చు. అదృష్ట రంగు: స్కై బ్లూ అదృష్ట సంఖ్య: 3 పరిహారం: రామాలయానికి జెండా సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : వ్యాపార భాగస్వామి లేదా సన్నిహిత సహచరుడితో సమస్య ఉండవచ్చు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. కొత్త ఆఫీస్లో చేరడానికి లేదా కొత్త ప్రాజెక్ట్లు, వెంచర్లను ప్రారంభించడానికి ఈ రోజు ఏమాత్రం అనుకూలంగా ఉండదు. అదృష్ట రంగు: పసుపు అదృష్ట సంఖ్య: 1 పరిహారం: హనుమంతుడి గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : మీకు ఇష్టమైన వారితో మ్యూచువల్ ఇంటరాక్షన్ పెంచుకోవచ్చు. పనికిరాని పనుల్లో కాలక్షేపం చేయకండి. ఇలా చేస్తే డబ్బు పోతుంది, వచ్చిన అవకాశాలను కూడా పోగొట్టుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి, ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అదృష్ట సంఖ్య: 6 అదృష్ట రంగు: నలుపు పరిహారం: శివునికి నీటితో అభిషేకం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) శారీరక సమస్యలు పెరగవచ్చు. అప్పుల గురించి ఆందోళన ఉంటుంది, రోజువారీ అవసరాలను తీర్చడానికి డబ్బు అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక సమస్య కారణంగా పని ప్రభావితం కావచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అదృష్ట సంఖ్య: 3 అదృష్ట రంగు: పింక్ పరిహారం: భైరవ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : రోజువారీ అవసరాలను తీర్చడానికి ఎక్కువ డబ్బు ఖర్చు కావచ్చు, సమయానికి అనుగుణంగా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి లేదా భవిష్యత్తులో ఇబ్బంది పెరుగుతుంది. పగ తీర్చుకోవాలనే భావానికి దూరంగా ఉండటం మంచిది. అదృష్ట సంఖ్య: 1 అదృష్ట రంగు: ఎరుపు పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగే అవకాశం ఉంది, దీని కారణంగా ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది, కానీ కాలక్రమేణా, పని ప్రారంభమవుతుంది. అదృష్ట సంఖ్య: 7 అదృష్ట రంగు: బంగారు రంగు పరిహారం: ఆవులకు పచ్చి మేత తినిపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : అదృష్టం కారణంగా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. పనికిరాని విషయాల్లో సమయాన్ని వృథా చేయకండి. మీతో ఏదో కారణంగా కొందరికి వివాదాలు పెరగవచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి లేదంటే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. అదృష్ట సంఖ్య: 9 అదృష్ట రంగు: వైలెట్ పరిహారం: పసుపు రంగులో ఉండే తినదగిన పదార్థాలను దానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : :ఆఫీస్లో మీ పనికి ఫలితాలు భవిష్యత్తులో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి, మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడవచ్చు. మీతో ఏదైనా విషయంలో కొందరికి వివాదాలు తీవ్రమవుతాయి. అదృష్ట సంఖ్య: 5 అదృష్ట రంగు: పసుపు పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : పనిలో విజయం సాధించడం వల్ల మీ మనోబలం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. మీ బార్గెయినింగ్ కెపాసిటీ పెరగవచ్చు. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అదృష్ట సంఖ్య: 4 అదృష్ట రంగు: బాదామి పరిహారం: శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) :వ్యాపార ఒప్పందాలతో లాభాలు గడిస్తారు. ఆగిపోయిన ధనాన్ని పొంది సంతోషిస్తారు. పనికిరాని విషయాల్లో సమయాన్ని వృథా చేయకండి. ఒకేసారి రెండు పనులు చేయవద్దు. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. అదృష్ట రంగు: ఫిరౌజీ అదృష్ట సంఖ్య: 2 పరిహారం: పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఇల్లు వదిలి వెళ్లండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆత్మీయుల మాటలు మనసును కుదిపేస్తాయి. శారీరక సమస్యలు పెరగవచ్చు. నిలిచిపోయిన పనుల గురించి ఆందోళన చెందడం సహజం, ఓపిక పట్టండి. ధన నష్టం కలగవచ్చు, జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య: 8 అదృష్ట రంగు: తెలుపు పరిహారం: 'ఓం నమః శివాయ' అని 108 సార్లు జపించండి. (ప్రతీకాత్మక చిత్రం)