(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం) : జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశుల వారి ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం, మార్చి 28 మంగళవారం నాడు ఏయే రాశికి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
వృషభ రాశి (Taurus) : యంత్రాలకు సంబంధించిన పనుల్లో ఏదైనా ఒప్పందం లేదా ఆర్డర్ రావచ్చు. ఉద్యోగస్తులు తమ ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ట్రేడింగ్ వ్యాపారంలో లక్ష్యాలను సాధించడం చాలా కష్టమైన పనిలా అనిపించవచ్చు. అయితే ఈ కష్టానికి తగ్గ మంచి ఫలితాలను కూడా పొందుతారు. పరిహారం : విఘ్నేశ్వరుడిని పూజించండి.
వృశ్చిక రాశి (Scorpio) : ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఇప్పుడు సరైన సమయం కాదు. దీంతో ప్రస్తుత పరిస్థితులపై మాత్రమే దృష్టి పెడితే మంచిది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం బెటర్. ఆఫీసులో ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. పరిహారం : యోగా, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి.
మకర రాశి (Capricorn) : వృత్తిపరమైన రంగంలో కృషి, సామర్థ్యంతో మీ లక్ష్యాన్ని సాధిస్తారు. అయితే ఈ సమయంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీడియో, మార్కెటింగ్ సంబంధిత పనులపై మరింత ఫోకస్ చేయండి. ఉద్యోగస్తులు తమ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే కొన్ని పొరపాట్లు జరగవచ్చు. పరిహారం : సూర్యునికి నీటిని సమర్పించండి.