(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం) : జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశుల వారి ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం, మార్చి 21 మంగళవారం నాడు ఏయే రాశికి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మేష రాశి (Aries) : ఏదైనా కీలకమైన పనిని ప్రారంభించే ముందు మీ ప్రియమైన వారిని సంప్రదించండి. ఎవ్వరిపైనా ఎప్పుడూ ఎక్కువ నమ్మకం ఉంచవద్దు, అలా చేయడం నష్టానికి దారి తీస్తుంది. బిజినెస్ ఇంటరాక్షన్స్‌లో పారదర్శకతను కొనసాగించడం దీర్ఘకాలంలో మంచిది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పరిహారం - దుర్గాదేవికి కాషాయ రంగు వస్త్రం సమర్పించండి.
మిథున రాశి (Gemini) : మ్యూచువల్ రిలేషన్షిప్స్ మెరుగుపడతాయి. పనిలో లీడర్షిప్కు మరిన్ని అవకాశాలు ఉంటాయి, ఆర్థిక వృద్ధికి అవకాశం పెరుగుతుంది. రోజువారీ జీవితంలో క్రమశిక్షణ, నిబంధనలను పాటించండి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. డబ్బు సంపాదించడానికి అవసరమైన పనిని కొనసాగించండి. పరిహారం - అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి.
కర్కాటక రాశి (Cancer) : పని విస్తరణలో మీ తెలివి, జ్ఞానంతో నిర్ణయం తీసుకుంటే.. తప్పకుండా విజయం సాధిస్తారు. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి, లేకపోతే అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు మీతో తరచుగా అద్భుతమైన వార్తలను పంచుకుంటారు. ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. ఉన్నత లక్ష్యం నిర్దేశించుకోండి. పరిహారం - పొద్దున్నే లేచి సూర్యుడికి నీరు సమర్పించండి.
తుల రాశి (Libra) : ఈరోజు మీ ఆత్మవిశ్వాసం అత్యధికంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం కొనసాగుతుంది. అన్ని కోణాల నుంచి మీకు సానుకూల వార్తలు వస్తాయి. మీ వైభవం జీవితాంతం పెరుగుతుంది. స్థిరాస్తి మెరుగుదలకు డబ్బు ఖర్చు అవుతుంది. అందరిలో సమానత్వంపై అవగాహన పెంచుకోండి. పరిహారం - శారీరక వికలాంగులకు సేవ చేయండి.
వృశ్చిక రాశి (Scorpio) : విషయాలను కొత్త యాంగిల్ నుంచి గమనించడం సులభం అవుతుంది. జీవనశైలి మెరుగుపడుతుంది, కానీ కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అద్భుతమైన ఉద్యోగ ఆఫర్లను అందుకుంటారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రత్యేక సందర్భాల గురించి ప్రియమైన వారికి చెబుతారు. పరిహారం - నల్ల కుక్కలకు ఆహారం ఇవ్వండి.
మకర రాశి (Capricorn) : బంధువులను గౌరవిస్తారు. విలువలను ప్రోత్సహిస్తారు. సంప్రదాయ పనుల్లో పాల్గొంటారు. సొంత వ్యక్తుల సలహా తీసుకుంటారు. పాలసీ రూల్స్ ఫాలో అవ్వండి. చిన్న చిన్న ప్రలోభాలకు దూరంగా ఉండండి, లేకుంటే మీరు ఆరోపణలో చిక్కుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పరిహారం - తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి.
కుంభ రాశి (Aquarius) : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది, నిలిచిపోయిన ముఖ్యమైన పనులు ఈరోజు సులభంగా పూర్తవుతాయి. మ్యూచువల్ ట్రస్ట్‌తో కుటుంబ సంబంధాల బలం పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది, ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. షార్ట్ టర్మ్ సక్సెస్ కోసం చేయకూడని పనులపై శ్రద్ధ చూపవద్దు. పరిహారం - తల్లి ఆవుకు పచ్చి మేత తినిపించండి.