(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : ఆస్ట్రాలజీ ఎక్స్పర్ట్స్ నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి ఉద్యోగం, వృత్తి వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను అంచనా వేస్తుంటారు. డిసెంబర్ 18వ తేదీ.. ఆదివారం నాడు వివిధ రాశుల వారికి ధన జ్యోతిషం లేదా మనీ ఆస్ట్రాలజీ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
మేష రాశి (Aries) : వ్యాపార విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టమైన ఆలోచనతో వ్యవహరించాలి. చాలా సమస్యలు సులువుగా, త్వరగా పరిష్కారమవుతాయి. పైకి చేరుకోవడానికి సాధ్యమైన ప్రతీదీ చెయ్యండి. అనవసరమైన పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. అలా చేయడం వల్ల డబ్బు నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో మీకు వచ్చే అవకాశాలను కోల్పోవచ్చు. పరిహారం - శివుడికి నీటిని సమర్పించండి.
వృషభ రాశి (Taurus) : ఆర్థిక విషయాలలో ఈరోజు అదృష్టవంతులు. స్థాపించిన వ్యాపారం విస్తరిస్తుంది. వనరులను పెంచడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలి. పని ప్రదేశంలో దొంగతనం జరిగే అవకాశం ఉంది. మీరు ఆన్లైన్ మోసానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. పరిహారం - భైరవ దేవాలయంలో కొబ్బరికాయ సమర్పించండి.
కర్కాటక రాశి (Cancer) : ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది కానీ కాలక్రమేణా పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డబ్బును ఇంటి ఖర్చులకు ఉపయోగించకండి. సరైన సలహా తీసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టండి. భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలు వస్తాయి. పరిహారం - ఆవుకు పచ్చి మేత తినిపించండి.
సింహ రాశి (Leo) : మీరు అదృష్టం కోసం అవకాశాలు పొందవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం ఉంది. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఏదైనా విషయంలో మీతో విభేదాలు పెరగవచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి లేకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. పరిహారం - పసుపు ఆహార పదార్థాలను దానం చేయండి.
కన్య రాశి (Virgo) : ఆఫీస్లో శారీరక అసౌకర్యం కారణంగా పని ప్రభావితం కావచ్చు. దీని కారణంగా అధికారుల దృష్టిలో మీ ప్రతిష్ట మసకబారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. పరిహారం - కృష్ణుని ఆలయంలో వేణువును సమర్పించండి.
కుంభ రాశి (Aquarius) : సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఖర్చు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. అనుకోని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి విషయం ఏమిటంటే కుటుంబం నుంచి సపోర్ట్ ఉంటుంది. పరిహారం - రామ మందిరంలో కూర్చుని రామరక్షా స్తోత్రాన్ని పఠించండి.