మేషం (Aries): బుధ సంచారంతో మీలో ధైర్యం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ప్రజలను మెప్పించగలరు. మీడియా, బ్యాంకింగ్ రంగాల వారు ధనలాభం పొందుతారు. ఉద్యోగం మారాలని చూస్తున్న వారు శుభవార్త వింటారు. మీ సోదరుడు, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer): బుధుడి సంచారంతో మీకు బాగా కలిసి వస్తుంది. మీ పనితీరును ఆఫీసులో అందరూ ప్రశంసిస్తారు. కొత్త బాధ్యతలు కూడా చేపట్టాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో కొన్ని శుభ కార్యాలు నిర్వహించవచ్చు. మీ తల్లి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆమె నుంచి మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)