మనందరికీ కలలు వస్తాయి. కొంతమందికి నిద్రపోతున్నంతసేపూ కలలు వస్తూనే ఉంటాయి. మరికొంత మందికి కొద్దిసేపే కలలు వస్తాయి. నిద్ర లేచాక... కలను మర్చిపోతాం. ఐతే... కలలను అధ్యయనం చేస్తే... భవిష్యత్తును అంచనా వేయవచ్చంటున్నారు డ్రీమ్ నిపుణులు. చాలా సందర్భాల్లో జరగబోయే మంచి, చెడులను కలలు ముందే సంకేతాల రూపంలో చెబుతాయి అంటున్నారు.
చాలా మందికి కలల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి. తెల్ల పాము కలలో కనిపిస్తే... మీరు చాలా ఆనందపడవచ్చంటున్నారు నిపుణులు. జీవితంలో గొప్ప విజయం సాధించే ముందు ఇలా తెల్ల పాము కనిపిస్తుందని చెబుతున్నారు. తెల్లపాము కనిపించేవాళ్లకు ముందున్న సమస్యలన్నీ ఆటోమేటిక్గా తొలగిపోతాయట. డబ్బు పెద్ద ఎత్తున వచ్చి పడుతుందని చెబుతున్నారు.
నిండా పండ్లతో ఉన్న చెట్టును మీరు కలలో చూస్తే... దాని అర్థం మీకు డబ్బు రాబోతోందని. మీకు మీరుగా చెట్టు నుంచి పండ్లను తెంపుతున్నట్లు కల వస్తే... మీరు స్వయంగా డబ్బును తీసుకోబోతున్నారని అర్థం అంటున్నారు నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these.)