వృశ్చిక రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశిలోకి కుజుడు సంచరించిన వెంటనే వృశ్చిక రాశి వారికి రాజయోగం కలుగుతుందట. దీనివల్ల ఆదాయం పెరగడంతో పాటు వ్యాపారాల్లో విపరీతమైన లాభాలను పొందే అవకాశం ఉంటుందట. ఈ రాశి వారు ఆర్థికంగా బలంగా మారతారట. అంతేకాకుండా సంఘంలో ఈ రాశి వారి గౌరవ మర్యాదలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సింహరాశి : కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన వెంటనే సింహ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. దీనివల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగంలో పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. జీతం పెరిగే అవకాశం కూడా కనిపిస్తోందని జ్యోతిష్యం పేర్కొంటుంది. వీరికి ప్రస్తుతం మంచి కాలం నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య రాశి : కన్య రాశి వారికి కూడా వచ్చే 25 రోజులు చాలా లాభదాయకంగా ఉంటుంది. నిలిచిపోయిన అనేక పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇది మీ భవిష్యత్తును నిర్ణయించేదిలా ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంది. మీరు కలలు గన్న ఉద్యోగం త్వరలోనే మీది కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)