మరోవైపు కుజుడు శుభ స్థానంలో ఉంటే మాత్రం సదరు వ్యక్తి జీవితం సుఖాలతో నిండి ఉంటుంది. ఏ చింతా లేకుండా సాగిపోతుందని జ్యోతిష్యులు భావిస్తారు. ప్రస్తుతం కుజుడు వృషభరాశిలో ఉన్నాడు. అతడు అక్టోబర్ 16న మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మిథునరాశిలోకి అంగారకుడి సంచారం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. (ప్రతీకాత్మక చిత్రం).
అంగారకుడి సంచారం మేషరాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులను తెస్తుంది. కొత్త జాబ్ ఆఫర్ రావొచ్చు. ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందవచ్చు. జీతం భారీగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇది చాలా లాభాన్ని ఇస్తుంది. వాక్కు సంబంధిత పనులు చేసే వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం).
సింహ రాశి వారికి అంగారక గ్రహ సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పని విషయంలో మీరు చాలా శ్రద్ధ పెడతారు. దాంతో మీరు ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ మొత్తంలో లాభ పడతారు. స్టాక్ మార్కెట్, లాటరీ సంబంధిత రంగాల్లోని వారు లాభాలు పొందే అవకాశం ఉంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం).
కర్కాటక రాశి వారికి అంగారకుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు, వ్యాపారులకే లాభదాయకంగా ఉంది. మీరు చదువుకుంటుండగానే జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో అధికారుల మద్దతు లభిస్తుంది. మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయం. (ప్రతీకాత్మక చిత్రం).
అంగారకుడి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన చికాకు పుట్టిస్తున్న పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించవచ్చు. విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా ప్రయోజనాలను ఇస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం).