1. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్. శబరిమలలో అయ్యప్ప దర్శనం కోసం వర్చువల్ క్యూ టోకెన్ల జారీ (Virtual-Q Tokens) కొనసాగుతోంది. మండల పూజ, మకరవిలక్కు పూజ కోసం ట్రావెన్కోర్ దేవోసమ్ బోర్డ్ (Travancore Devaswom Board) వర్చువల్ క్యూ టోకెన్లు ఇటీవల రిలీజ్ చేసింది. అయ్యప్ప భక్తులు https://sabarimalaonline.org/ వెబ్సైట్లో టోకెన్లు బుక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయ్యప్ప భక్తులకు 2022 నవంబర్ 16 నుంచి 2022 డిసెంబర్ 27 వరకు మండల పూజ కోసం, 2022 డిసెంబర్ 30 నుంచి 2023 జనవరి 14 వరకు మకరవిలక్కు పూజ కోసం వర్చువల్ క్యూ టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ టోకెన్లు ముందుగానే బుక్ చేసుకొని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయ్యప్ప భక్తులు పనిచేస్తున్న మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడీతో పిలిగ్రిమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు వర్చువల్ క్యూ బుకింగ్ అవసరం లేదు. అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ చేసేప్పుడు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు, అకౌంట్ నెంబర్లు, ఏటీఎం పిన్, పాస్వర్డ్, సీవీవీ, ఓటీపీ లాంటివి వెల్లడించకూడదని ట్రావెన్కోర్ దేవోసమ్ బోర్డ్ హెచ్చరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. శబరిమలలో వర్చువల్ క్యూ టోకెన్ల జారీ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రారంభమైంది. ఇప్పుడూ అదే విధానాన్ని కొనసాగిస్తోంది ట్రావెన్కోర్ దేవోసమ్ బోర్డ్. ఈసారి కూడా వర్చువల్ క్యూ టోకెన్లు తీసుకున్న అయ్యప్ప భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. కాబట్టి అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లే ముందే వర్చువల్ క్యూ టోకెన్లు తీసుకోవాలి. మరి వర్చువల్ క్యూ టోకెన్లు ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా https://sabarimalaonline.org/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Virtual-Q ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. మీరు ఏ తేదీన దర్శనం చేసుకోవాలనుకుంటే ఆ తేదీ సెలెక్ట్ చేయాలి. సమయం వారీగా అందుబాటులో ఉన్న టోకెన్ల సంఖ్య కనిపిస్తుంది. అందులో మీరు కోరుకున్న సమయం సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత Login పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మొదటిసారి స్లాట్ బుక్ చేస్తున్నట్టైతే Register పైన క్లిక్ చేయాలి. లేదా మీ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. వర్చువల్ క్యూ బుకింగ్ పూర్తైన తర్వాత మీ ఇమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది. ఆన్లైన్లో టోకెన్ ప్రింట్ తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)