Mahashivaratri 2023 : మానసిక నిపుణుల ప్రకారం.. సమీప భవిష్యత్తులో జరగబోయే అంశాల్లో కొన్ని మనకు కలలో ముందే వస్తుంటాయి. అవి ఒక హెచ్చరిక లాగా పనిచేస్తాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే... రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ఒక్కోసారి ఆ కలలు శుభ సంకేతాలవుతాయని పండితులు చెబుతున్నారు. శివరాత్రి సందర్భంగా శివుడు ముందుగానే కలలో సూచనలు ఇస్తాడని అంటున్నారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో కృష్ణ పక్షం పద్నాలుగో రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రిని ఫిబ్రవరి 18న శనివారం జరుపుకోబోతున్నారు. ఈ తేదీలో రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడిని త్వరగా ప్రసన్నం చేసుకుంటారు. ఉపవాసం, ఆరాధన, జాగరణ, శివనామం ధ్యానం మహాదేవుని అనుగ్రహాన్ని తెస్తుంది. మహాశివరాత్రికి ముందు కొన్ని కలలు శుభ సంఘటనలను సూచిస్తాయి. మీకు శివుని ఆశీస్సులు ఉన్నాయని ఈ కలలు తెలియజేస్తాయి. మహాశివరాత్రికి ముందు వచ్చే కలలు ఆనందాన్ని సూచిస్తాయి.
ఢమరుకం : పురాణాల ప్రకారం.. శివుడు 14 సార్లు ఢమరుకాన్ని వాయిస్తాడు. ఆ తర్వాత సృష్టిలో రాగాలు, లయలు పుట్టుకొచ్చాయి. కావున మహాశివరాత్రి నాడు ఢమరుకాన్ని దర్శనం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఢమరుకం కల జీవిత స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ కల.. మీ ఇంట్లో వివాహం జరిగే సంకేతం ఇస్తుంది. (Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)