.మనస్పూర్తిగా ఆ శివయ్యను థ్యానించి జలాన్ని అభిషేకించి, ఒక మారేడు పత్రాన్ని ఆ లింగంపై ఉంచితే చాలు. కోరిన కోరికలు నెరవేర్చడంలో భక్త సులభుడు కూడా ఈయనే. ఇక పరమ శివుడికి సోమవారం అత్యంత ప్రీతి పాత్రమైనది. దాంతో పాటు ఇక పరమ శివుడికి ప్రతి నెల అమావాస్య ముందు రోజును మాస శివరాత్రి వస్తూ ఉంటుంది. ఇక మాఘ మాసంలో వచ్చే బహుళ చతర్దశి రోజున మనం మహా శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. లింగోద్భవం జరిగిన రోజు హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా కొందరు అనుకోని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా శివారాధన సందర్భంగా మనం చేయకూడని కొన్ని తప్పులు ఏంటో తెలుసుకుందాం.. (ప్రతీకాత్మక చిత్రం)
హిందూ మత విశ్వాసాల ప్రకారం మహా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం. దాంతో పాటు మాస శివరాత్రి రోజున కానీ.. అలా వీలు ప్రతి యేడాది మాఘ బహుళ చతుర్ధశి రోజున వచ్చే మహా శివరాత్రి నాడు శివారాధన చేసే భక్తులు.. తెల్లవారుజామున నిద్రలేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
శివుని పూజలో ఈ తప్పులు అసలు చేయకండి.. శివారాధానకు అంకితమైన సోమవారం లేదా మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నపుడు కొన్ని నియమాలు గుర్తించుకోవడం ముఖ్యం. శివుడి పూజలో మనమందరం పాలతో క్షీరాభిషేకం చేస్తాము. పాలతో అభిషేకం చేసేటపుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి. కాబట్టి.. స్టీలు గిన్నెలతో లేకపోతే.. మట్టి పాత్రలో పాలును అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం.ముఖ్యంగా గుళ్లో పండితులతో నమకం చమకం 11సార్లు పారాయణం చేస్తే రుద్రం అంటారు. అలా చేసిన వాళ్లకు పునర్జన్మ ఉండదని ప్రతీతి. (ప్రతీకాత్మక చిత్రం)
హిందూ మత విశ్వాసాల ప్రకారం అభిషేకం తర్వాత విభూతితో అలంకారం చేసిన తర్వాత చందనంతో తిలకం తీర్చిదిద్దాలి. ఎట్టి పరిస్థితుల్లో సింధూర తిలకం మాత్రం పెట్టవద్దు. శివుడి ఆలయంలో శివ లింగానికి పూర్తి ప్రదక్షిణలు చేయకూడదు. మీరు ప్రదక్షణ చేసిన చేసిన పానవట్టం నుంచి తిరిగి వెనక్కి వెళ్లి ప్రదక్షిణలు చేయాలి. మొత్తంగా సోమ వారం లేదా మహా శివరాత్రి రోజున ఈ నియమాలు పాటిస్తే.. శివుడు అత్యంత ప్రసన్నడై కోరిన కోరికలు నెరవేరస్తాడని ప్రతీతి. (ప్రతీకాత్మక చిత్రం)