Navaratri 2020: కనక దుర్గ అమ్మవారి ప్రతిరూపాల్లో... తారా మాత రూపం ఒకటి. చూడటానికి ఈ అమ్మవారు అపరకాళికలా గంభీరంగా ఉన్నా... ఎంతో ప్రశాంత చిత్తంతో ఉంటారు. ఈ మాత దగ్గర అనంతమైన శక్తి ఉంటుంది. ఈ శక్తి మనపై ప్రసరిస్తే చాలు... మన జీవితాలు పూర్తిగా ఆనందమయం అయిపోతాయని పండితులు చెబుతున్నారు. శక్తి ప్రసరించేందుకు తారా మాతను ధ్యానించుకోవాలని సూచిస్తున్నారు.
తారామాత కొలువైన తారాపీఠం ఆలయం బెంగాల్... భీర్భూమ్ జిల్లా... చాందీపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని తాంత్రికుల ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ తాంత్రిక పూజలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ ఆలయానికి సాధువులు, స్మశానాల్లో నివసించే అఘోరాలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. తమ జీవితమంతా... అమ్మవారిని పూజిస్తూ... ఆ భక్తికే అంకితం చేస్తారు. ద్వారకా నది పక్కన ఉండే ఈ ఆలయం అత్యంత శక్తిమంతమైనదిగా గుర్తింపు పొందింది.