Love Horoscope 2023 : ప్రేమ జీవితంలో ఉన్నవారికి, ప్రేమ జీవితంలోకి ప్రవేశిస్తున్నవారికి కొత్త సంవత్సరం ఏవిధంగా ఉండబోతోంది? ఏ రాశివారి ప్రేమ.. పెళ్లికి దారితీయబోతోంది? ఎవరి ప్రేమ విఫలం కాబోతోంది? కొత్త సంవత్సరంలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారబోతున్నాయి. జనవరి 18న శని... కుంభ రాశిలోకి, ఏప్రిల్ 23న గురువు.. మేష రాశిలోకి,.. అక్టోబర్ 24న రాహువు... మీన రాశిలోకి, అదే రోజున కేతువు... కన్యా రాశిలోకి మారడం జరుగుతుంది. ఈ గ్రహాల ప్రభావం ఇతర అంశాల మీద పడినట్టే, ప్రేమల మీద కూడా పడుతుంది. ఈ గ్రహాల రాశి మార్పు ఫలితంగా ఏయే రాశుల వారు ప్రేమ జీవితంలో విజయం సాధించబోతున్నారనేది ఆసక్తికరమైన విషయం.
శుక్ర గ్రహం (Venus) ప్రేమలకు, ప్రేమ వివాహాలకు కారకుడు. అయితే, ప్రేమలను విజయవంతం చేయాలంటే గురు గ్రహం (Jupiter) అనుగ్రహించాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాల్లో ఒకటవ, ఏడవ, అయిదవ, రెండవ, పదకొండవ రాశులను బట్టి ప్రేమ వివాహాల సంగతి చెప్పాల్సి ఉంటుంది. ఒకరు మరొకర్ని ప్రేమించినంత మాత్రాన అది తప్పనిసరిగా పెళ్లికి దారితీస్తుందని చెప్పలేం. ప్రేమలు విజయవంతం కావచ్చు. కాకపోవచ్చు. అయితే, జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులను బట్టీ, గ్రహ సంచారాన్ని బట్టీ ప్రేమల గురించి అంచనా వేయడానికి అవకాశం కలుగుతోంది. ఏది ఏమైనా, మేష, మిథున, తుల, ధనస్సు రాశుల వారికి గ్రీన్ సిగ్నల్ పడుతుంది. వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులవారికి రెడ్ సిగ్నల్ ఖాయం. (ప్రతీకాత్మక చిత్రం)
మేష రాశి (Aries) : శని, గురు, రాహువులు.. రాశులు మారడం అనేది ప్రేమలు, ప్రేమ వివాహాల విషయంలో తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. ఈ ఏడాది ప్రేమలు విజయవంతం అయ్యే రాశుల్లో మొదటగా చెప్పుకోదగి౦ది మేష రాశి. ప్రేమల్లో పడబోతున్నవారికి, ఇప్పటికే ప్రేమల్లో ఉన్నవారికి.. ఫిబ్రవరి, మే నెలల మధ్య పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. వారి ప్రేమలు తప్పకుండా పెళ్లికి దారితీస్తాయని చెప్పవచ్చు. అయితే, తమ ప్రేమ జీవితం పెళ్లి దాకా వెళ్లాలంటే ఈ రాశివారు కొద్దిగా అడ్వెంచర్ చేయాల్సి ఉంటుంది. తల్లితండ్రుల్ని ఒప్పించడం కొద్దిగా కష్టమవుతుంది.
ధనస్సు రాశి (Sagittarius) : ఈ రాశివారు కూడా ప్రేమలో పడడానికి అవకాశం ఉంది. పెద్దలు అంగీకరించే వరకూ ఆగడం తమ కర్తవ్యమని వీరు ఆలోచిస్తారు. చివరికి తల్లితండ్రుల్ని ఒప్పించే పెళ్లి చేసుకుంటారు. ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, వివాహం చేసుకోవడానికే వీరు ఇష్టపడతారు. అవసరమైతే కొంతకాలం ఆగడానికి కూడా వీరు సిద్ధపడతారు.
వృషభ రాశి (Taurus) : వృషభ రాశివారు ప్రేమలో పడినట్టయితే, పెళ్లికి కొంత కాలం ఆగడం మంచిది. తల్లితండ్రుల్ని కాదని వీరు వివాహం చేసుకోవడం జరిగే విషయం కాదు. వీరికి కుటుంబ సంబంధాలు ముఖ్యం. అందువల్ల అందరూ కలసి వచ్చే వరకూ వీరు ఆగడం ఖాయం. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం, వీరు మరో ఏడాది అగాల్సిన పరిస్థితి ఉంది.
సింహ రాశి (Leo) : సింహరాశి వారు కూడా ఈ సంవత్సరం ప్రేమ విషయంలో అచ్చం కర్కాటక రాశివారిలాగే వ్యవహరిస్తారు. వీరు కూడా ప్రేమలో పడి ఉన్నట్టయితే తొ౦దరగా బయటపడరు. అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. తమ దగ్గరకు తల్లితండ్రులు తెచ్చిన పెళ్లి సంబంధాలను ఏదో ఒక కారణం చెప్పి రద్దు చేయిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి నవ౦బర్ తర్వాత ప్రేమలు పెళ్లిగా మారే అవకాశం ఉంది.