మన దేశంలో చాలా మంది అనాదీగా పరమ శివుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం.. అలంకార ప్రియుడు విష్ణువు.. ఆయనకు అలంకారం అంటే ఎంతో ప్రీతి. అందుకే వైష్ణవ ఆలయాలలో ఎక్కువడా అలంకరణలు చేస్తుంటారు. ఇక శివుడిని అభిషేక ప్రియుడంటారు. శివుడికి కేవలం నీళ్లు, బిల్వదళాలు అంటే ఎంతో ఇష్టం. ఆయన తనపై భక్తుల నీళ్లు వేస్తే ఆనందంతో పొంగిపోతారు.
సోమవారం ఉపవాసం ఈ క్రింది విధంగా చేయాలి : మత విశ్వాసాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. శివలింగానికి జలాభిషేకం మీ ఇంట్లో లేదా సమీపంలోని శివాలయంలో చేయాలి. ఈ సమయంలో శివుడు, పార్వతీ తల్లికి పూజ చేసి.. సోమవార వ్రత కథను వినండి. సోమవారం ఉపవాస సమయంలో ఒకేసారి ఆహారం తీసుకోవడం సముచితమని భావిస్తారు. కానీ కొంత సమయం తర్వాత మీరు పండ్లు తీసుకోవచ్చు.
ఇక, పూజ చేసేటప్పుడు శివలింగం చుట్టూ ధూపం ఎక్కువగా వేయకూడదు. కొన్ని సార్లు... మనం అగరబత్తులను వెలిగించినప్పుడు వాటి కర్రలు, మసి విగ్రహం మీద పడే అవకాశం ఉంటుంది. పురాణాల ప్రకారం.. శివుడికి చందనం మీద తీసిన గంధం అంటే ఎంతో ప్రీతి. ఇది చల్లగా ఉంటుంది. కానీ ప్రస్తుతం మార్కెట్ లో ఏవేవో గంధపు బాటిళ్లను ఉపయోగిస్తున్నారు.
కానీ చందనంతో పెట్టిన బొట్టు ఎంతో మంచిది. అభిషేకం చేసేటప్పుడు పాలలో కొన్ని నీళ్లను కలపాలి. కేవలం గట్టిగా ఉన్న పాలను ఉపయోగించరాదు. అదే విధంగా, ఏదైన శాంతులకు సంబంధించిన పూజలు చేసినప్పుడు పూజ చేసిన తర్వాత స్నానం చేసి, తిరిగి స్వామి వారిని దర్శించుకొవాలి. దీంతో స్నానం తర్వాత.. ఉన్న దోషం పూర్తిగా పోతుంది. ఇలాంటి నియమాలు పాటించడంతో ఆ పరమ శివుని అనుగ్రహం పొందవచ్చు.