Lunar Eclipse 2021:హిందూ సంప్రదాయంలో కార్తీక పూర్ణిమకు (kartika poornima) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పౌర్ణమినే త్రిపరి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు శివుడు (lord shiva) త్రిపురాసురుడిని సంహరించాడని నమ్ముతారు. అప్పటి నుంచి శంకరుడిని త్రిపురారి అని కూడా పిలుస్తారు. ఈ సారి కార్తీక పూర్ణిమ నవంబర్ 19 శుక్రవారం రానుంది. నిజానికి కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ప్రబోధిని ఏకాదశి నుంచి ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ పవిత్ర పూర్ణిరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది.
ఈ చంద్రగ్రహణం భారత్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, భారత తూర్పు భాగంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్ర గ్రహణం కనిపించనుంది. (photo source collected)