రాశి ఫలాలతోపాటూ... చంద్ర రాశి అనేది మరొకటి ఉంటుంది. దీన్నే మూన్ సైన్ (Moon Sign) అంటారు. ఇది ఒక్కో రాశి వారికి ఒక్కోలా ఉంటుంది. ఓ వ్యక్తి పుట్టినప్పుడు మూన్ సైన్ ఏ స్థానంలో ఉంది అన్న దాన్ని బట్టీ... వారు ఏ రంగు రాళ్లు ధరించాలన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇవాళ చందమామ... కుంభరాశిలో ఉంటే... ఇవాళ భూమిపై పుట్టిన వారంతా... కుంభ రాశి మూన్ సైన్ కలిగివుంటారు.
రంగు రాళ్లకూ మూన్ సైన్కీ సంబంధం ఉంటుంది. మూన్ సైన్ ఆధారంగా ఏ రాశి వారు ఏ రాయిని ధరించాలో జ్యోతిష పండితులు నిర్ణయించారు. ఆ ప్రకారం కొని తొడుక్కుంటే... మంచి జరుగుతుందని చెబుతున్నారు. కాస్త రేటు ఎక్కువైనప్పటికీ... నాణ్యమైన రాయిని మాత్రమే కొనుక్కోవాలనే విషయం మర్చిపోవద్దు. అప్పుడే ప్రయోజనాలు కలుగుతాయని పండితులు వివరించారు.
చాలా మంది ఉంగరాల్లో రత్నాలు ధరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో. మనం ఇప్పుడు పగడం గురించి మాట్లాడుకుందాం. పగడం ధరించడం ద్వారా జాతక బలం చేకూరుతుంది. ఒక వ్యక్తి యొక్క జాతకం చెడు స్థితిలో ఉంటే , చెడు ప్రభావాలను కలిగి ఉంటే, అప్పుడు పగడాన్ని ధరించాలి. మరి దీనిని ఎవరు ధరించాలి..? దీని వల్ల కలిగే ఉపయోగాలేంటో ఓసారి చూద్దాం..
సింహ రాశివారికి పగడం అదృష్టాన్ని తీసుకువస్తుంది. శ్రమ ఫలించనప్పుడు సింహభాగం లాభాన్ని పొందడానికి పగడాన్ని ధరించడం ఉత్తమం. పగడపు ధారణ ద్వారా సింహ రాశి వారి విధి మరింత మెరుగుపడుతుంది. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )