* కుంభం : కొంతమంది వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని కలవాలనుకున్నప్పుడు జీవితంలోని ప్రతి అంశానికి రొమాన్స్‌ను జోడించే సహజ సామర్థ్యం వారిలో ఉంటుంది. కోరుకునే భాగస్వామిని వారు తరచుగా జపం చేస్తుంటారు. అయితే, కుంభరాశి వారు ఈ కేటగిరీలోకి అసలు రారు. ఎవరితోనైనా ప్రేమలో పడటానికి కెమిస్ట్రీ అవసరం లేదని బలంగా నమ్ముతారు. వీరికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌పై అసలు నమ్మకం ఉండదు. ముక్కు మొహం తెలియని వారితో ఒకసారి చూస్తే ప్రేమలో పడడం అనేది ఈ రాశివారికి నాన్సెన్స్లా అనిపిస్తుంది.
* ధనుస్సు : ఈ రాశివారు పెళ్లి తరువాత రొమాంటిక్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే దానిపై పెద్దగా నమ్మరు. ఒకవేళ ఎవరినైనా ప్రేమించాలంటే వారి గురించి కూపీ లాగుతారు. అన్ని విషయాలు తెలుసుకున్నాకే ముందుకు అడుగు వేస్తారు. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే రిలేషన్‌కు కటిఫ్ చెప్పేస్తారు. మొదటి చూపులో ప్రేమను అసలు నమ్మరు.
* కర్కాటకం : ఈ రాశివారు విలువలతో జీవిస్తుంటారు. తమ మనోభావాలకు అనుగుణంగా తరచూ నిర్ణయాలు తీసుకుంటారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పై వీరికి అసలు నమ్మకం ఉండదు. ప్రతి విషయంలో ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. రొమాంటిసిజాన్ని అంగీకరించడానికి వెనుకాడతారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పేరుతో ఓ వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ కావడం వీరికి నచ్చదు. మ్యూచువల్ ఫ్రెండ్షిప్, హార్డ్‌వర్క్ ద్వారా రిలేషన్స్ కలుపుకోవడానికి ఆసక్తి చూపుతారు.
* సింహం : ఈ రాశివారు అశావాదిగా ఉంటారు. ప్రతి విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తుంటారు. జీవితం పట్ల గొప్ప ఉత్సాహాంగా, ఏదో సాధించాలనే పట్టుదలతో ఉంటారు. అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌పై వీరికి సదాభిప్రాయం ఉండదు. లవ్ అనే విషయం గరించి అసలు పట్టించుకోరు. వ్యక్తిగతంగా, వృత్తిలో ఎలా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే దానిపై నిరంతంరం ఆలోచిస్తుంటారు. ప్రేమ అంటేనే ఆమడ దూరం పరుగెత్తుతారు.