మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 )
ముఖ్యమైన పనులన్నీ శ్రమ లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌కి అవకాశం ఉంది. దూరం ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ సఫలమవుతుంది. ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం, ఆరోగ్య ఫర్వాలేదు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. స్నేహితురాలికి బహుమతులు కొనిస్తారు. వ్యాపారులకు అన్నివిధాల బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది.
మిథునం (మృగశి 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 )
ఆర్థికంగా చాలా బాగుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కోర్టు కేసు అనుకూలం అవుతుంది. ఆరోగ్య ఫర్వాలేదు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, అశ్లేష)
ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధ తప్పదు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. స్నేహితురాలి మీద ఖర్చు చేస్తారు. కోర్టు కేసు వాయిదా పడుతుంది.
ధనస్సు(మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1 )
ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, స్వయం ఉపాధివారికి అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధువుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్టం 1,2)
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తరు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్లవు. వ్యాపారులు శ్రమపడక తప్పదు.
కుంభం (ధనిష్ట 3,4 శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం బాగానే ఉంటుంది. కొంతవరకు అప్పులు తీరుస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. వ్యాపారుల లాభాలు నిలకడగా ఉంయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయం పెరుగుతుంది. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గించుకుంటారు. ఉద్యోగులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఆర్థికంగా కొద్దిగా పర్వాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో ముందడుగు వేస్తారు.