మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 )
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. తలపెట్టిన పనులన్నీ శ్రమ లేకుండా పూర్తవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు చూడటానికి వస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ప్రేమ సఫలమవుతుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు కొద్దిగా పర్వాలేదు. ఎవరకీ హామీలు ఉండవద్దు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త
మిథునం (మృగశి 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 )
రోజు బాగానే గడిచిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభవార్తలకు అవకాశం ఉంది. సహోద్యోగులు సహకరిస్తారు. వ్యాపారులు లాభాల బాట పడతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త, ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, అశ్లేష)
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పర్వాలేదు. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్లవు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 )
అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, స్వయం ఉపాధివారికి ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. ఆస్తి పేచీ విషయంలో మాట సహాయం కోసం బంధువులు మిమ్మల్ని ఆశ్రయించే అవకాశం ఉంది. లాయర్లకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి.
వృశ్చికం ( విశాఖ 4, అనురాధ, జేష్ట్య)
ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం ఫర్వాలేదు.
ధనస్సు(మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1 )
ఉద్యోగం సంతృప్తికరంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంది.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్టం 1,2)
ఉద్యోగానికి ఆఫర్లు వస్తాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధలు తప్పవు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఆశించిన శుభవార్త వింటారు.
కుంభం (ధనిష్ట 3,4 శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆరోగ్యం ఫర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు లేదు. సత్సంగాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలపరంగా బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి