మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు రాణిస్తారు. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం పరవాలేదు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త, తలచిన పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు శ్రమ తప్పదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్టు) ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి. ఐ.టి వారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) తలచిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలకు సమయం బాగుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్తాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులు సహాయపడతారు. అర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) అనుకోకుండా చేతికి డబ్బు అందుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తు౦ది. ఉద్యోగం విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. నష్టపోతారు. భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంది. ముఖ్యంగా స్వయం ఉపాధి వారికి సమయం అనుకూలంగా ఉంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. అరోగ్యం జాగ్రత్త.