కుటుంబంలో ఎల్లవేళలా సుఖసంతోషాలు ఉండాలని అని కోరుకుంటారు. దానికోసం పగలు రాత్రి పనులు చేస్తారు. కొన్ని సార్లు డబ్బు, ఆహారానికి కొరత ఏర్పడుతుంది. వాస్తు ప్రకారం కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించడం వల్ల దీన్ని నుంచి బయట పడవచ్చు. దీంతో ఆ ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల సంపద పెరుగుతుంది.తులసి మొక్కను ఇంటికి ఉత్తరాన నాటుకోవాలి. ఇది ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. దీంతో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో తులసి మొక్కను నాటడం, తల్లిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.