Horoscope today: ఈ రోజు ఎలాంటి పనులు ప్రారంభించాలి.. ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి.. అని తెలుసుకోవాలి అనుకోవడం సహజం.. మరి ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలాలు ఉంటాయి.. ఏఏ అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఎలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. గ్రహాలు, తిథులు, కాలం, నక్షత్రాలు అన్నీ లెక్కలోకి తీసుకొని నేడు జ్యోతిష పండితులు ఎలాంటి రాశి ఫలాలు చెబుతున్నారో చూద్దాం.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఈ రోజు మేష రాశివారికి గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య కార్యాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో లాభాలు ఆశించినంతగా ఉండవు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) అన్నివిధాలా అనుకూలమైన సమయం ఇది. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీతో వివాదాలకు దిగే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆశించినంతగా వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి.. పని ఒత్తిడి ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. వృత్తి నిపుణులు శ్రమ పడాల్సి ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) అనుకూలమైన సమయం ఇది. తగినంత ప్రయత్నం చేస్తే అదృష్టం మీదవుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. మీ వల్ల నలుగురికీ మేలు జరు గుతుంది. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికులు సరదాగా గడుపుతారు. వ్యాపారంలో విశేషమైన పురోగతి కనిపిస్తోంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రేమికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి నిపుణులకు బాగుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ఠ 1,2) మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగల వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో కూడా శుభఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. వృత్తి నిపుణులు సునాయాసంగా లాభాలు ఆర్జిస్తారు. కోర్టు కేసులో నెగ్గుతారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హా మీలు ఉండొద్దు.