Horoscope today: ఈ రోజు ఎలాంటి పనులు ప్రారంభించాలి.. ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి.. అని తెలుసుకోవాలి అనుకోవడం సహజం.. మరి ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలాలు ఉంటాయి.. ఏఏ అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఎలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. గ్రహాలు, తిథులు, కాలం, నక్షత్రాలు అన్నీ లెక్కలోకి తీసుకొని నేడు జ్యోతిష పండితులు ఎలాంటి రాశి ఫలాలు చెబుతున్నారో చూద్దాం.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం నిలకడగా ఉంటుంది. వీలైనంతగా పొదుపు ప్రయత్నాలు చేస్తారు. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మంచికాలం. స్నేహితురాలితో ఉత్సాహంగా షికార్లు చేస్తారు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారులకు బాగుంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. కొంత వరకు రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. తల పెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్త లువింటారు. విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు చాలా బాగుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2) అన్ని విధాలా అనుకూలమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగుల ఉద్యోగం ప్రయత్నం ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. సామాజిక సేవా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం అనుకూలంగానే ఉంటుంది. కోర్టు కేసులో నెగ్గుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పరవాలేదు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరతారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల సమయం. తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహా రాలు ఫలిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఇంటా బయట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తి నిపుణులు, చిన్న వ్యాపారులకు ఆర్థికంగా చాలా బాగుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు అను కూలంగా ఉన్నాయి.