వృషభ రాశి : ఈ నెలలో వృషభ రాశి వారికి పని భారం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్షణం కూడా విరామం తీసుకోకుండా చేయాల్సి వస్తుంది. మీరు తొందర పడితే ఆ పని పెద్ద విపత్తులకు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. ఓర్పుగా ఉండండి.. అన్నింటిని పూర్తి చేయగలరు. ఇక ఈ నెలలో ఈ రాశి వారికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. డైరీ సంబంధిత ఫుడ్ ను తీసుకోవడం తగ్గించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిధున రాశి : జూలై నెలలో ఈ రాశి వారు విలాసవంత వస్తువులపై భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. మీకు ఇప్పుడు అవసరం అనిపించేవి రేపు నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. వస్తువులను కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆకుకూరలను మీ ఆహారంలో ఎక్కువగా తీసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశి : ఈ రాశి వారికి జూలై నెల చాలా బాగా ఉంటుంది. డబ్బు విషయంలో.. వర్క్ విషయంలో ఎటుంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీరు ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో ఉదర సంబంధిత సమస్యలు రావొచ్చు. మాంసాహారాన్ని అలాగే బయట తినడాన్ని తగ్గిస్తే మంచిది. వంటల్లో మసాలాలను కాస్త తక్కవగా వేసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చిక రాశి : జూలై నెల ఈ రాశి వారికి ఎన్నో శుభాలను కలుగజేసేలా కనిపిస్తుంది. జాబ్ చేసే వారికి పదోన్నతి.. వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు ఉంటాయి. చిన్నపాటి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. అన్ని అవంతట అవే సర్దుకుంటాయి. సంయమనంతో ఉండండి. పండ్లను ఎక్కువగా తినండి. ముఖ్యంగా అరటిపండును. (ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు రాశి : పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్త అవసరం. గతంలో బాధించిన నొప్పులు మళ్లీ వచ్చే అవకాశం ఉంది. తరచూ వ్యాయామం చేస్తూ ఉండండి. అలాగే పసుపు నీళ్లతో స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురి కాకుండా ఉండే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)