అదృష్టంతో పాటు విజయం వీరి సొంతం : Sతో పేరు మొదలయ్యే వ్యక్తుల స్నేహపూర్వక వైఖరి కారణంగా, గ్రూప్‌లోని సభ్యులు వీరిని లీడర్‌గా ఎంపిక చేస్తారు. వీరు తమ సెల్ఫ్ ఇంట్రస్ట్‌ను పూర్తిగా పక్కన పెడితే, ఏ పరిస్థితిలోనైనా సర్దుబాటు చేసుకునేంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. వీరు విజయవంతమైన రాజకీయ నాయకులుగా గుర్తింపు తెచ్చుకోగలరు. వ్యాపారవేత్తలు, మీడియా పర్సన్స్, స్పోర్ట్స్ స్టార్స్, యాక్టర్స్‌గా మంచి గుర్తింపు పొందుతారు.
విద్యార్థులకు ఇలా.. : విద్యార్థులకు S అక్షరం అదృష్టాన్ని పెంచుతుంది. ఈ ఆల్ఫాబెట్‌తో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎల్లప్పుడూ ఉన్నత చదువులు, మాస్ కమ్యూనికేషన్‌పై దృష్టి పెట్టాలి. ముఖ్యమైన సమావేశాలకు హాజరైనప్పుడు పసుపు, నారింజ, తెలుపు, ఎరుపు, బ్లూ మొదలైన ప్రకాశవంతమైన రంగుల దుస్తులు ధరించాలి. వారు సక్సెస్‌లో అదృష్టంతో స్వదేశంలో లేదా విదేశాల్లో పని చేయవచ్చు. వీరి శ్రేయస్సు కోసం జీవిత భాగస్వాములు కూడా సహకరిస్తారు. వీరు అందమైన తల్లిదండ్రులుగా, పిల్లలుగా పేరొందుతారు.(ప్రతీకాత్మక చిత్రం)
పాటించాల్సిన నియమాలు : - ఆశ్రమాలకు గోధుమలు దానం చేయండి. - సూర్య భగవానుడికి నీటిని సమర్పించి ఆ దైవ నామాన్ని జపించండి. - ఆఫీస్‌లోని ఉత్తరం వైపు గోడకు ఆర్టిఫిషియల్ పొద్దుతిరుగుడు పువ్వులను ఉంచండి. - కనీసం వారానికి ఒకసారి పసుపు పొడిని నీటిలో వేసి స్నానం చేయండి. - ఎప్పుడూ లెదర్ బ్యాగ్ లేదా వాలెట్ మీ దగ్గర ఉంచుకోండి. - నాన్ వెజ్, లిక్కర్, పొగాకు, జంతువుల చర్మంతో చేసే లెదర్ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండండి.