మేషం :(Aries) జీవితంలో మార్పులేని సమయంలో పాత అభిరుచిని తిరిగి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మీరు కొన్నిసార్లు కదలికలేని జీవితంలో చిక్కుకున్నట్లు అనిపించవచ్చు. డబ్బు వ్యవహారాలు ఒక వారంలో మూమెంట్ ఉండే అవకాశం ఉంది. కొత్త బంధాలు, పరిచయాలను ఏర్పరచుకోవడం కంటే తెలిసిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. లక్కీ సైన్- తెరిచిన గేటు
వృషభం: (Taurus) దేని గురించైనా ఆందోళన పడుతుంటే, దాన్ని ఇప్పుడు పరిష్కరించాలని నిర్ధారించుకోండి. విషయాన్ని ఎక్కువసేపు లాగడం మంచిది కాదు. ఒక ప్రత్యేకమైన అవకాశం మీ తలుపు తట్టవచ్చు. మీరు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే అది మరొకరికి వెళ్లవచ్చు. మీరు చిన్నపాటి కోపం లేదా చికాకుతో ఉండవచ్చు. లక్కీసైన్- బోన్ చైనా సెట్
మిథునం :(Gemini) ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు మొదట్లో మౌనంగా గమనిస్తూ, ఆ తరువాత ఆలోచనలతో సహకరించడం మీ స్వభావం. అయితే, ఈసారి మీరు మొదటి నుంచి పాలుపంచుకోవచ్చు. సంభాషణ లేదా గ్రీటింగ్స్ తెలపడం కోసం గత కొన్ని నెలలుగా ఒక ఎక్స్ మిమ్మల్ని ఫాలో అవుతుంటాడు. పని కట్టుబాట్లను క్రమబద్ధీకరించాలని చూస్తున్నారు. అయితే అందుకు సమయం కుదరడం లేదు. ఇంకొన్ని రోజులు అలాగే కొనసాగుతుంది. లక్కీ సైన్- అమెథిస్ట్
కర్కాటకం: (Cancer) వేగం, ప్రయాణం బట్టి రాబోయే వారం ఉంటుంది. మీరు చేస్తున్న పనిలో మీకు ఇప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. దీంతో మీ సమయాలకు అనుగుణంగా కొత్త షెడ్యూల్ రూపొందించుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది. మీలోని తీవ్రమైన భావోద్వేగాల కారణంగా మీరు డిస్కనెక్ట్ అయినట్లు మీ కుటుంబం భావించవచ్చు. ఇంటికి కొత్త పెంపుడు జంతువును తీసుకురావడంపై మీరు ఆలోచించవచ్చు. వ్యాపారస్తులకు ఉత్తర దిశ అనుకూలంగా ఉండవచ్చు. లక్కీసైన్ - మెరిసే పెయింటింగ్
సింహం :(Leo) అంతర్గతంగా ఉన్న కొత్త అభిరుచి ఇప్పుడు కనిపిస్తోంది. మీరు కూడా దీన్ని పంచుకోవడానికి మరింత నమ్మకంగా ఉన్నారు. మీకు మద్దతు ఇవ్వడానికి పాతదాన్ని విశ్వసించండి. దానిపై సొంత సమయాన్ని వెచ్చించండి. సహోద్యోగి మీ జీవితంలో భాగం కావడం కావచ్చు. బంధం మరింత బలపడుతుంది. ఈ మధ్య కాలంలో మానసికంగా మీ గురించి మీకు అంత ఖచ్చితంగా అంచనాకు రాలేకపోవచ్చు. అయితే ప్రస్తుత శక్తులు మిమ్మల్ని స్థిరంగా అభివృద్ధి వైపు నడిపిస్తాయి. ఏదైనా వ్యసనం ఉంటే, మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చు. లక్కీసైన్-ఇండోర్ ప్లాంట్
కన్య :(Virgo) ఏదో కొత్తది రూపుదిద్దుకుంటోంది. అది ఇక్కడే ఉండవచ్చు. ఆ దిశగా కూడా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంపై కొన్ని సూచనలు మీ దరికి రావచ్చు. మీరు ఇప్పుడు స్నేహితులు, వర్క్ మధ్య సమయాన్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. పనికి సంబంధించిన ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. లక్కీసైన్- ఇష్టమైన పాత సినిమా
తుల:(Libra) జీవితంలో స్మార్ట్ ఎంపికలు పాత పద్ధతుల కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని కొత్త నియమాల చుట్టూ మీ జీవితాన్ని క్రియేట్ చేయండి. వాటిని సరళంగా యాక్సెస్ చేయగలిగేలా ప్రారంభించండి. మీ కోసం రాబోయే రోజుల్లో పెద్దగా జీవితంలో కదలిక ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఇది బోరింగ్‌గా, ఎలాంటి డైరెక్షన్ లేనిదిగా ఉండవచ్చు. ఒక యువకుడు మీకు స్ఫూర్తిని కలిగించవచ్చు. పాత పనులను కొత్త పద్ధతిలో చేస్తూ బిజీగా ఉండండి. లక్కీసైన్- కాపర్ టంబ్లర్
వృశ్చికం:(Scorpio) సంబంధాలు బలపడటానికి మీకు సంబంధించిన విషయాలు ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంది. దీంతో మీ కోరికల జాబితాను సిద్ధంగా ఉంచండి. కొన్ని విషయాలు నెరవేరడం మీరు చూడవచ్చు. ఆర్థిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది మంచి సమయం. మీ ఎంపికలను క్రమబద్ధీకరించండి. ప్రయాణాలు చేస్తే మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. లక్కీసైన్ - పగిలిన గాజు
ధనస్సు:(Sagittarius) మీరు ఒకే సమయంలో కుటుంబం, పనికి సబంధించిన అనేక విషయాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సాధ్యమేనని మీరు భావిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో చాలా వెనుకబడి ఉన్నారు. పనిలో మీ ఆధీనంలో ఉన్నవారితో స్పష్టమైన సంభాషణను కలిగి ఉండండి. మీ సీనియర్ టీమ్‌తో నేరుగా కమ్యూనికేట్ చేస్తూ ఉండవచ్చు. మీరు కొత్త భాగస్వామ్యం గురించి ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు సమయం వచ్చింది. వ్యక్తిగత వినోదం కోసం కొంత సమయం కేటాయించండి. లక్కీ సైన్ - రెండు పిచ్చుకలు
మకరం:(Capricorn) అప్పు ఎలాంటిదైనా ఇప్పుడు ఇబ్బందులు స్టార్ అవుతాయి. ఈ సంవత్సరం కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు త్వరలో అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. పెండింగ్‌లో ఉన్న పేపర్‌వర్క్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. మీ తల్లి మీకు అత్యంత సన్నిహితురాలు అని నిరూపితమవుతుంది. దాన్ని అలాగే కొనసాగించండి. కంటి సమస్యల కారణంగా త్వరలో మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించాల్సి రావచ్చు. లక్కీ సైన్ - పాస్టెల్ కర్టెన్
కుంభం:(Aquarius) మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ఆనందం కోసం స్కిల్స్ పెంపొందించుకోండి. అది మీ నెట్‌వర్క్‌ను డెవలప్ చేస్తుంది. రోజు చేసే కొన్ని కొత్త పనులు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమవ్వడానికి ఇది మంచి సమయం. కొన్ని సమయాల్లో గ్రౌండింగ్ సమర్థవంతమైన ప్రారంభానికి పునాదిలా ఉపయోగపడుతుంది. కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఇంట్లో వంట చేయడానికి మీరు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఇంట్రస్ట్ చూపవచ్చు. లక్కీ సైన్ - డోర్‌బెల్ శబ్దం
మీనం :(Pisces) ఎనర్జీస్ మానసికంగా సంతృప్తికరమైన సమయాన్ని అందిస్తాయి. మీరు ఆన్లైన్లో ఎక్కువ సమయం గడపవచ్చు. పిల్లలకు మీ నుంచి మంచి మాటలు అవసరం కావచ్చు. పాత స్నేహితుడు మిమ్మల్ని ఆకర్షించేలా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. కొత్త గ్రూమింగ్ రొటీన్ లేదా సెల్ప్-పాంపరింగ్ షెడ్యూల్ ఈ రోజును ప్రకాశవంతం చేస్తుంది. లక్కీ సైన్- పసుపు ఆకులు