పిల్లలకు పుట్టిన తేదీలోని అంకెల ఆధారంగా ఆల్ఫాబెట్ సెలక్ట్ చేసుకుని పేరు పెడితే మంచి జరుగుతుందని న్యూమరాలజీ చెబుతోంది. ఆ ప్రభావంతో ఉన్నత స్థానాలు అందుకుంటారని, కీర్తి, ప్రతిష్టలు దక్కుతాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం.. ఆల్ఫాబెట్ I, Jతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
ఆల్ఫాబెట్ I : ఇంగ్లీష్ లెటర్ Iతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా కష్టపడి పని చేస్తారు. సోమరితనాన్ని అస్సలు ఇష్టపడరు. వీరికి అన్ని విషయాలపై మంచి అవగాహన ఉంటుంది. మాటలు చాలా డీప్‌గా ఉంటాయి. ఎటువంటి పరిస్థితులలో అయినా జీవించగలిగే ప్రత్యేకమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఉన్నత అవకాశాలను అందుకుంటారు. చంచలమైన మనస్సుకు విశ్రాంతి ఇవ్వాలి, లేకపోతే తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
I లెటర్ అనేది 9వ సంఖ్యను సూచిస్తుంది. దీనిపై గురు గ్రహం ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ బిజినెస్, గృహోపకరణాలు, స్పోర్ట్స్ ఈవెంట్లు, టెలికాం, ఎంటర్ట్రైన్మెంట్ బిజినెస్‌లకు లెటర్ Iతో మొదలయ్యే పేరు పెట్టవచ్చు. Iతో పేరు పెట్టిన కంపెనీలు భవిష్యత్తులో మంచి గుర్తింపు తెచ్చుకుంటాయి. అద్భుత లాభాలను అందిస్తూ అదృష్ట సంస్థలుగా మారుతాయి. ఉదా: ఇమాజికా, ఐకియా,పరిహారం: ఎరుపు ధాన్యాన్ని మీ సంచిలో ఎప్పుడూ ఉంచుకోండి. లక్కీ కలర్స్: రెడ్(ప్రతీకాత్మక చిత్రం)
ఆల్ఫాబెట్ J : ఆల్ఫాబెట్ Jతో పేరు మొదలయ్యే వ్యక్తులు బ్రాడ్ మైండెడ్, ప్రాక్టికల్, అడ్వాన్స్డ్, కాంటెంపరరీగా ఉంటారు. ఫ్రీడమ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. తమ చుట్టూ ఏం జరుగుతుందో సులువుగా తెలుసుకుంటారు. పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయగల సమర్థులు. వీరు చాలా తెలివైనవారు. మోసం చేయడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. వీరు తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్న, అభిరుచులు కలిసి వ్యక్తులతో సులువుగా కలిసిపోతారు.(ప్రతీకాత్మక చిత్రం)
వీరు ఇతరులతో కలవడానికి సమయం పడుతుంది. పరిస్థితుల ప్రకారం వారి మనస్సును మెరిపిస్తారు. భౌతిక ఆనందం తాత్కాలికమని గుర్తుంచుకోవాలి. భౌతిక ప్రపంచానికి తమ హృదయాన్ని, ఆత్మను ఇవ్వకుండా నిరోధించాలి. తమ ఫిజికల్ అపీయరెన్స్ను చక్కగా మెయింటైన్ చేస్తారు. గ్లామర్, ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌ల రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. పరిహారం: సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి,లక్కీ కలర్స్: ఎల్లో