ఆర్థిక సంక్షోభం నుంచి భయటపడేందుకు : దీర్ఘకాలంగా ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలనుకున్నా పరిష్కారం దొరకడం లేదా? అయితే మీరు శుక్రవారం నాడు మహా లక్ష్మికి గులాబీ పువ్వులు, రెండు లవంగాలను సమర్పించండి. దీని తరువాత, 5 లవంగాలు, 5 రూపాయాలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి.. మీరు డబ్బును ఉంచే చోట ఉంచండి. పూర్తి భక్తితో ఈ పరిహారం చేయండి. మీరు త్వరలో లాభాలను చూస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
విజయం కోసం : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయలుదేరినట్లయితే.. మీ నోటిలో రెండు లవంగాలను వేసుకొని వెళ్లండి. ఇలా చేయడం ద్వారా, మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా మీ పనిలో మీరు తప్పకు విజయం సాధిస్తారని జ్యోతిష్యులు నమ్ముతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)