Dream Meaning: మీరు కలలో పాము కాటుకు గురైతే.. జీవితంలో ఈ మార్పు తప్పదట..
Dream Meaning: మీరు కలలో పాము కాటుకు గురైతే.. జీవితంలో ఈ మార్పు తప్పదట..
Snake Dream: నిద్రపోతున్నప్పుడు స్పష్టమైన కలలు రావడం సర్వసాధారణం. కానీ చాలా మందికి ఆ కలలకు అర్థం తెలియదు. మీకు కలలో పదే పదే పాము కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసుకోండి.
పాములంటే ఎవరికైనా భయం సహజం. దాని తోకను చూసినా ఆశ్చర్యపోతాం. కానీ కలలో పామును చూడటం వేరే అర్థం. కలలో పదే పదే పాము కనిపిస్తే భయం వేస్తుంది.
2/ 8
అయితే నాగుపామును భగవంతుని రూపంగా భావిస్తాం. అలాగే కలలో నాగుపాము లేదా మరేదైనా పాము కనిపిస్తే, అది మనకు వార్నింగ్ ఇస్తున్నట్లు భావిస్తాం. అయితే కలలో పాము వస్తే భయం మధ్యలోనే లేచిపోతాం.
3/ 8
మీకు కలలో నల్ల పాము కాటు వేస్తే : మీకు కలలో నల్ల పాము కనిపిస్తే, అది అశుభ సంకేతం అని మీకు తెలుసా. పురాణాల ప్రకారం, మీకు కలలో నల్ల పాము కనిపిస్తే, సమీప భవిష్యత్తులో మీకు సమస్యలు ఎదురవుతాయని అర్థం. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్యకు సూచన కావచ్చు..
4/ 8
కలలో నల్లపామును చంపడం: కలలో పామును చంపితే శుభసూచకం. ఇలా కలగంటే మీకు శత్రువులు ఉండరని అర్థం. అంటే మీరు కూడా విజయం సాధిస్తారని అర్థం.
5/ 8
నల్ల పాము, ముంగిసల మధ్య పోరు: మీ కలలో పాము , ముంగిస మధ్య పోరు కనిపిస్తే, ఇది కూడా చెడ్డ సంకేతం. పురాణాల ప్రకారం, మీరు ఇలా కలలుగన్నట్లయితే, మీరు న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. దాన్నుంచి బయటపడటం కష్టమని కూడా అంటున్నారు.
6/ 8
కలలో పామును పట్టుకోవడం : కలలో పామును పట్టుకోవడం మీకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో, మీకు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అలాగే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉంది.
7/ 8
కలలో పాము కాటుకు గురైతే: మీ కలలో ఏదైనా పాము కాటుకు గురైతే, అది దురదృష్టానికి సూచన. మీరు ఇలా కలలుగన్నట్లయితే, మీ ఉద్యోగ, వ్యాపారంలో మీకు సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.
8/ 8
కలలో పాము పదే పదే వస్తే పితృ దోషానికి సంకేతంగా చెబుతారు. పిత్రో దోషం ఉంటే కలలో పాము కనిపిస్తుందని అంటారు. కాబట్టి దీనికి పరిష్కారం పొందడమే విముక్తి.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)