మీ చేతి నుండి నూనె..
పదేపదే పడిపోతే చేతుల నుంచి నూనె పడిపోతే కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. పదే పదే చేతి నుండి నూనె పడటం మనిషి జీవితంలో ఏదో పెద్ద సమస్య రాబోతుంది. ఇది మాత్రమే కాదు ఇది ఒక వ్యక్తి అప్పులపాలు కావడానికి కూడా సంకేతం. లక్షలాది ప్రయత్నాలు చేసినా అలాంటి వారు రుణ విముక్తులు కాలేకపోతారు.
పూజా పళ్ళెం..
మీ చేతి నుండి పదే పదే పూజా పళ్లెం పడిపోతే, అది చాలా అశుభ సంకేతం. దేవుడు మీ పట్ల దయ చూపడం లేదని అర్థం. ఉపవాసం, పూజల వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. భవిష్యత్తులో పెద్ద సమస్యకు సంకేతం కూడా కావచ్చు. భోజనం చేసేటప్పుడు లేదా వడ్డిస్తున్నప్పుడు పదే పదే మీ చేతుల నుండి ఆహారం పడిపోతే.. దానికి రెండు ప్రత్యేక అర్థాలు ఉంటాయి. ముందుగా, మీ ఇంటికి అతిథి రాబోతున్నారు. రెండవది, కొంత ప్రతికూల శక్తి లేదా పేదరికం మీ ఇంటిని తాకబోతోంది. వాస్తు దోషాల వల్ల కూడా ఇది సాధ్యమవుతుంది.