ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు మాత్రమే కాదు మంచి ఉపాధ్యాయుడు కూడా. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వవిద్యాలయం నుండి విద్యను అభ్యసించిన ఆయన నైపుణ్యం కలిగిన దౌత్యవేత్త, వ్యూహకర్త, ఆర్థికవేత్త కూడా. ఆచార్య చాణక్యుడు తన జీవితంలో అసహ్యకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు కానీ ఎన్నడూ భయపడలేదు,తన లక్ష్యాన్ని మరువలేదు. ఒక వ్యక్తి తన జీవితంలో ఆచార్య చాణక్యుడి మాటలను అనుసరిస్తే వారు జీవితంలో ఎప్పుడూ తప్పు చేయరు,విజయవంతమైన స్థితికి చేరుకోగలరు. ఆచార్య చాణక్యుడు.. మానవ సంక్షేమానికి సంబంధించిన దాదాపు అన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఆచార్య చాణక్య కూడా ప్రేమ సంబంధాల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఆచార్య చాణక్య కూడా ప్రేమ సంబంధాల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాణక్యుడు ప్రకారం... ఏ సంబంధం యొక్క ఆనందం అయినా, శాంతి అయినా సంబంధాన్ని కొనసాగించే వారిపై ఆధారపడి ఉంటుంది. ప్రేమికుడు-ప్రియురాలు మధ్య సంబంధం బలహీనంగా ఉంటే, సంబంధంలో చీలికకు ఎక్కువ సమయం పట్టదు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. వీటిని తెలుసుకుంటేప్రేమలో వచ్చే టెన్షన్ వెంటనే తొలగిపోతుంది.
చాణక్యుడు ప్రకారం..ఒక వ్యక్తి తన భాగస్వామిని గౌరవించాలి. ఒక వ్యక్తి తన భాగస్వామిని అందరి ముందు కించపరచకూడదు. అలా చేస్తే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా తన గౌరవాన్ని కూడా కోల్పోతాడు. దీని కారణంగా ప్రేమ సంబంధంలో చీలిక ఏర్పడటం అనివార్యం, కాబట్టి ప్రేమికుడు-ప్రియురాలు తమ భాగస్వామిని ఒకరినొకరు గౌరవించాలి.