నిజమైన లక్ష్యాన్ని గుర్తిస్తారు: దాదాపు అన్ని ఇండియన్ టెలికాం కంపెనీల ఫోన్ నంబర్లు 9తో మొదలవుతాయి. ఈ అంకెను పాలించే అంగారక గ్రహం చాలా ముఖ్యమైనది. ఇది సంబంధిత వ్యక్తుల జీవితంలో నిజమైన లక్ష్యాన్ని గుర్తించేలా చేస్తుంది. మంచిగా ప్రవర్తించేలా చేస్తుంది. ఆదర్శవంతమైన వ్యక్తులుగా నిలుపుతుంది. పెద్ద, ఉన్నతమైన విషయాలను ఆలోచించే సామర్థ్యాన్ని ఇస్తుంది. వారి పరిధిని విస్తృతం చేస్తుంది, ఓపెన్ మైండెడ్‌గా ఉంచుతుంది. 9వ అంకె ప్రభావంతో అనుకున్న ప్రకారం ఒక పని జరగకపోతే అసహనానికి గురవుతారు. అలాంటి వ్యక్తులు ఉద్రేకానికి గురవుతారు, వారి మనస్సుకు తోచిన ఏదైనా మాట్లాడతారు లేదా గొడవలు ప్రారంభిస్తారు.
ఫోన్ నంబర్లో ఒక 9 ఉంటే : మొబైల్ నంబర్ సిరీస్‌లో ఒకసారి 9 ఉంటే.. కలలను నెరవేర్చుకోవడానికి జీవితంలో ముందుకు సాగాలనే బలమైన కోరికను సృష్టిస్తుంది. స్వీయ అభివృద్ధి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారికి తమ కలలన్నింటిని రియాలిటీగా మార్చుకొనే సామర్థ్యం ఉంటుంది. స్వచ్ఛమైన ఆలోచనలు, గొప్ప మనస్సు ఉంటుంది.
నంబర్ 9 రెండు సార్లు కనిపిస్తే : ఫోన్ నంబర్లో 9 రెండు సార్లు ఉంటే.. సంబంధిత వ్యక్తి ఆదర్శవంతంగా ఉంటారు. అలెర్ట్‌గా ఉంటారు, తెలివి ఎక్కువగా ఉంటుంది. తరచుగా ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఇతరులతో ఎక్కువగా కలిసిపోవడానికి ఇష్టపడరు. తమ గురించి గొప్పగా ఆలోచించరు. మిగిలిన వారి కంటే చాలా మంచివారని భావిస్తారు. కొన్నిసార్లు బిగ్షాట్స్లా వ్యవహరిస్తారు.
9వ అంకె మూడు సార్లు రిపీట్ అయితే : ఫోన్ నంబర్ సిరీస్‌లో 9వ అంకె మూడు సార్లు కనిపిస్తే.. వారికి విషయాలను అతిశయోక్తిగా మార్చి చెప్పగల అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. పుట్ట నుంచి పర్వతాన్ని తయారు చేయగలరు. వారు పర్యవసానాల గురించి పెద్దగా ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. ఇతరుల్లో మంచి అభిప్రాయం కలుగజేయడానికి, అసాధారణమైన పనులు చేయాలని నమ్ముతారు. ఇతరులు చెప్పేది వినరు. తమ వద్ద ఉన్నదంతా ఇతరుల ఇవ్వాలని భావిస్తే.. ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తారు.
మొబైల్ నంబర్లో 9 నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఉంటే : ఫోన్ నంంబర్లో 9 నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు ఉన్నప్పుడు.. వారి వ్యక్తిత్వంపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపదు. అంగారక గ్రహం అధిక ప్రభావం వారిని తమ ప్రపంచంలోనే కోల్పోయిన వ్యక్తులుగా మారుస్తుంది. తమ సమస్యను ఇతర వ్యక్తులతో పంచుకోవడంలో వెనకాడతారు. ఈ రకమైన మొబైల్ నంబర్ ఉన్నవారు.. తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు, తిరిగి షెల్‌లోకి రావడానికి ఇష్టపడతారు. వారు వారి సొంత కలలలో జీవిస్తారు. సోషలైజింగ్కి దూరంగా ఉంటారు. చివరకు చాలా క్లిష్టంగా, సమస్యాత్మకంగా మారతారు.
[caption id="attachment_1517230" align="alignnone" width="1600"] నంబర్ల మొత్తం 9 అయితే: ఫోన్ నంబర్లోని అంకెలన్నింటి మొత్తం 9 అయితే.. వారు మేధావి అవుతారు. తమ మనస్సును బాగా ఉపయోగించగలరు. ఆలోచనలకు బలాన్ని ఇస్తుంది, పేరు, కీర్తి, విజయాలను అందుకుంటారు. చాలా దయగల, మంచి ప్రవర్తన, మంచి మనుషులను సూచిస్తుంది. 9 వినూత్నంగా, గర్వంగా మారుస్తుంది. వీళ్లు సాధారణంగా చాలా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు.