Bhakti: అప్పు అనేది గుదిబండ లాంటిది. అది ఎప్పటికీ ప్రమాదకరమే. కొంచెం అప్పు ఉన్నా చాలు... దానిపై వడ్డీ, చక్ర వడ్డీ పడుతూ.. కొండలా మారుతుంది. అందువల్ల అప్పుల ఊబిలో ఉన్నవారు మాత లక్ష్మీదేవి శరణు కోరాలని పండితులు సూచిస్తున్నారు. అప్పుల్లో ఉన్నవారికి లక్ష్మీ స్తోత్రం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా మెరుగైన ఫలితాలు కావాలంటే ప్రతి శుక్రవారం... ఓ మట్టి ప్రమిదలో కమలం వేర్ల (lotus root)ను వెలిగించాలి. ఇలా చేస్తే... ఆ ఇంట సంపద పెరుగుతుంది. అశాంతి తొలగి మనస్శాంతి లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో సరైన నిర్ణయాలు తీసుకుంటూ... క్రమంగా అప్పుల ఊబి నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)