ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. లేదంటే ఇతరుల కంటే వెనుకబడే ప్రమాదం ఉంది. అందుకే, తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. చదువులో వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. బెస్ట్ స్కూల్లో చేర్పించడమే కాదు వారి కోసం ఇంట్లో ప్రత్యేక స్టడీ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
పిల్లల చదువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏకాగ్రతతో చదువుకునేలా స్టడీ రూమ్ సిద్దం చేస్తున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల గదిలో కొన్ని వస్తువులు ఉంచాలి. అప్పుడే వారిలో ఏకాగ్రత పెరిగి ఆహ్లాదకరంగా చదువుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల గదిలో ఉంచాల్సిన వస్తువులేంటి? వాటిని ఏ దిశలో ఏర్పాటు చేయాలి? వంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
గ్లోబ్.. పిల్లల స్టడీ రూమ్‌లో గ్లోబ్ ఏర్పాటు చేస్తుంటారు చాలా మంది. గ్లోబ్‌ను ప్రతి రోజూ చూడటం ద్వారా మీ పిల్లలకు ప్రపంచ పటంపై అవగాహన ఏర్పడుతుంది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం గ్లోబ్‌ను ఈశాన్య దిశలో ఏర్పాటు చేయండి. దీని వల్ల మీ పిల్లలు చదువులో రాణించడంతో పాటు మంచి మార్కులు సాధిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
అస్సలు చేయకూడనివి ఏంటంటే.. బాత్రూమ్ తలుపులు పిల్లల మంచం ముందు ఉండకూడదు. పిల్లల మంచం ముందు అద్దం ఉండకూడదు. పిల్లల గదిలో ఉపయోగించే లైటింగ్ చాలా ప్రకాశవంతంగా లేదా చాలా మసకగా ఉండకూడదు. పిల్లల గదిలో టీవీ వంటివి ఏర్పాటు చేయకూడదు. పిల్లల గదిలో ఉపయోగించే ఫర్నిచర్ గోడలకు ఎప్పుడూ తాకకూడదు. ఇది గదిలో పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)