ఇంట్లో శివలింగాన్ని ఎక్కడ ఉంచాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇంట్లోని ఈశాన్య ప్రదేశంలో శివలింగాన్ని ఉంచాలి. తద్వారా త్రినేత్రుడి కరుణ ఆ కుటుంబంపై ఉంటుంది. దీని వల్ల మీరు భయపడే అంశాల నుంచి బయటపడతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. మహాదేవుడి ఫొటోలు, విగ్రహాల్ని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. శుభ్రమైన నేలపై తెల్లటి వస్త్రం పరచి... దానిపై మాత్రమే ఉంచాలి.
పురాణాల ప్రకారం... శివలింగంను ఇంట్లో ఉంచి పూజిస్తే... ఆ ఇంటి యజమానికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లోని సభ్యులందరి మనసులూ, మెదళ్లూ ప్రశాంతంగా ఉంటాయి. కోపం పోతుంది. కుటుంబంలో అంతా కలిసి ఉంటారు. ఇంట్లోని నటరాజస్వామి విగ్రహం ఉంటే దానికి కచ్చితంగా పూజలు చెయ్యాలి. లేదంటే ఏదైనా ఆలయంలోనో, మరెవరికైనా ఇచ్చేయడం మేలు. పూజించకుండా ఇంట్లో ఉంచుకుంటే కీడు జరిగే ప్రమాదం ఉంటుంది.
శివలింగానికి మీరు ప్రతి రోజూ నెయ్యితో పూజ చెయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే మహదేవుడికి నెయ్యి అంటే అమితమైన ఇష్టం. ప్రతి సోమవారం మీరు శివ పూజ పూర్తయ్యేవరకూ ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అలాగే పూజ చేస్తున్నప్పుడు పాలతో శివలింగానికి అభిషేకం చెయ్యాలి. శివలింగం పై నుంచి పాలను పొయ్యాలి. తద్వారా స్వామి కృపకు మీరు పాత్రులవుతారు.