HOW EACH ZODIAC PEOPLE REACT IS ALL 12 GETS LOCKED TOGETHER IN A ROOM WITHOUT WINDOWS MKS
Zodiac Signs: ఒకే గదిలో బంధించి తాళం వేస్తే.. ఏ రాశివారు ఏం చేస్తారో తెలుసా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశి వారికి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలుంటాయి. ఒకే పరిస్థితిలో వారు ప్రవర్తించే తీరు భిన్నంగా ఉంటుంది. మొత్తం 12 రాశుల వారిని కిటికీలు లేని ఓ గదిలో ఉంచితే ఏ రాశి వారు ఎలా రియాక్ట్ అవుతారనే అంచనాలివి. మీ రియాక్షన్ ఓ సారి చెక్ చేసుకోండి..
మేషం: కిటికీలు లేని గదిలో 12 రాశుల వారిని బంధిస్తే తొలుత రియాక్ట్ అయ్యేది మేష రాశివారే. అందరి దృష్టిని ఆకర్షించడానికి తమ దగ్గర ఉపాయం ఉందని చెప్పుకుంటారు వీళ్లు. కానీ ఐడియా చెప్పమంటే ‘అయ్యో.. మర్చిపోయా..’అనే రకం వీళ్లు.
2/ 12
వృషభం: సాధారణంగా దూకుడు ప్రదర్శించే వృషభ రాశి వారు కిటికీలేని గదిలో బందీగా ఉండాల్సి వస్తే హైరానా, గాభరా పడిపోతారు. మూర్ఛవచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
3/ 12
మిథునం: కిటికీ లేని గదిలో మిగతా రాశులవారితో ఉండాల్సి వచ్చినప్పుడు మిథున రాశి వారు.. ఊహాత్మక మాటలు ఉంటేనే అందరినీ మాట్లాడమని అడుగుతారు.
4/ 12
కర్కాటకం: ఇలాంటి పరిస్థితిలో ఈ రాశి వారు లిటరల్ గా ఏడ్చేస్తారు. తమ జీవితంలో అంతిమ క్షణాలివే కావొచ్చని రోదిస్తారు.
5/ 12
సింహం: కిటికీలు లేని గది తలుపు లాక్ చేసి ఉంది కాబట్టి బయటికి వెళ్లడానికి ఫ్లోర్ బద్దలు కొడదామంటూ సింహ రాశి వారు ఇతరుల్ని కమాండ్ చేస్తారు. కానీ తాము మాత్రం ఇంచు కూడా కదలరు.
6/ 12
కన్య: ఈ పరిస్థితిలో అందరినీ కామ్‌గా ఉండాలంటూ కన్య రాశి వారు అభ్యర్థిస్తారు. కానీ చివరికి వీళ్లే పానిక్ అటాక్‌కు గురవుతారు.
7/ 12
తుల: పరిస్థితిని ఎప్పుడూ సమతూకంగా ఉంచడానికి ప్రయత్నించే తుల రాశి వారు కిటికీ లేని గదిలో బంధీ అయితే ఇతరులతో ఇంటరాక్ట్ కావడానికి ప్రయత్నిస్తారు.
8/ 12
వృశ్చికం: కిటికీలు లేని గదిలో ఉండాల్సి వస్తే వృశ్చిక రాశి వారు అట్టే ఉద్రేకపడిపోతారు. అరుపులు, కేకలు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
9/ 12
ధనుస్సు: ఈ పరిస్థితిలో ధనుస్సు రాశి వారు తీవ్ర గందరగోళానికి గురవుతారు. కిటికీలు లేని గదిలో ఉంటూ తొందరగానే నిలకడతత్వాన్ని కోల్పోతారు.
10/ 12
మకరం: కిటికీలేని గదిలో ఉండాల్సి వస్తే మకర రాశివారు తమ పరిస్థితి ఎంత దయనీయమో అందరినీ అడిగి ఖరారు చేసుకున్నాక చతికిలపడిపోయి దిక్కులు చూస్తుంటారు.
11/ 12
కుంభ: ఈ పరిస్థితిని కుంభ రాశి వారు తీవ్రంగా అనుమానిస్తారు. బహుశా ఇదొక సైన్స్ ప్రయోగమో, బిగ్ బాస్ హౌజో అని భ్రమించి, కెమెరాల కోసం వెతుకులాడుతారు.
12/ 12
మీనం: కిటికీ లేని గదిలో ఉండాల్సి వస్తే మీన రాశి వారు పరమ బోరుగా ఫీలవుతారు. చివరికి మిగతా వారితో ట్రూత్ ఆర్ డేర్ ఆటాడటానికి పూనుకుంటారు.