మిథునం (Gemini): శుక్రుడి రాశి పరివర్తనం మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ నెలలో ప్రయాణం చేయవలసి రావచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు,ఉద్యోగం చేసే వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీరు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.(ప్రతీకాత్మక చిత్రం)
తుల (Libra): ఉద్యోగం మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీరు చేసే పనిలో విజయం దక్కుతుంది. ధనలాభం పొందే సూచనలున్నాయి. డబ్బకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి. మీకు సహాయం చేయడానికి చాలా మంది ముందుకొస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (Aquarius): ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. కొత్త ప్రాజెక్ట్ చేపట్టవచ్చు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీరు ఏ పని చేసినా ప్రయోజనం ఉంటుంది. లాభం వస్తుంది. శివుడి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది. ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (Pisces): ఆఫీసు నుంచి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నెలాఖరులో గుడ్ న్యూస్ వింటారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)