మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థికంగానే కాక అన్ని విధాలా కలిసి వస్తుంది. కొంచెం చొరవ తీసుకుని ప్రయత్నిస్తే పనులన్నీ పూర్తవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ కోరికలు తీరతాయి. అవసరాలకు ధనం అందుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. మితిమీరిన ఖర్చులకు కళ్లెం వేయాలి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) కాలం కలిసి వస్తోంది. విజయాలు, సాఫల్యాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ రాణిస్తారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి నిపుణులు ఆశించిన స్థాయిలో ఆదాయం పెంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) అకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి. మిత్రుల వల్ల ఊహించని మేలు జరుగుతుంది. ఉద్యోగంలో సహోద్యోగులు అవరోధాలు సృష్టించే అవకాశముంది. కుటు౦బ విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. స్నేహితురాలితో ఉత్సాహంగా షికారు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగ, వ్యాపారాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. అసంపూర్తిగా ఉండిపోయిన పనులు పూర్తి చేసుకునేందుకు ఇది మంచి సమయం. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయమూ మున్ముందు కలిసి వస్తుంది. సమీప బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) చక్కని అవకాశాలు కలిసి వస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగ జీవితంలోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ మంచి పురోగతికి ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత కృషి అవసరం. బంధువుల్లో మిమ్మల్ని అవమానించే వారుంటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. వృత్తి నిపుణులకు శ్రమ తప్పదు. ఖర్చులు బాగా తగ్గించుకోండి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబ సమస్యలు ఒక్కొటొక్కటిగా పరిష్కారమవుతాయి. సామాజికంగా కొత్త బాధ్యత చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చు. ఆస్తి అభివృద్ధి చెందే నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వ్యక్తిగత జీవితంలో కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. అనేక విధాలుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. శత్రుపీడ తొలగుతుంది. భూ, గృహ లాభాల మీద దృష్టి సారిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఉద్యోగం అఫర్ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎటు చూసినా విజయాలే గోచరిస్తున్నాయి. వ్యాపార లాభముంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరంగా సహాయ సహకారాలులభిస్తాయి. ఆశించినంతగా అదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు ప్రయోజనం పొ౦దుతారు. ప్రేమలు ఫలిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఇది ఆదాయపరంగా కలిసొచ్చే కాలం. తలపెట్టిన పనులు సఫలమవుతాయి సమయం అనుకూలంగా ఉన్నందువల్ల మేలైన భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుంచి అభిన౦దనలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2) గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని అనుకూల ఫలితాలనిస్తాయి. కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. మిత్రులు, స్నేహితురాలి ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశముంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) మనసులోని చిరకాల కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగ౦ లభిస్తుంది. లాభాల కోసం వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ, సామాజిక రంగలోని వారికి సమయం కొద్దిగా అనుకూలంగా ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మితిమీరిన ఔదార్యం కారణంగా సమస్యలు కొనితెచ్చుకుంటారు. శుభవార్త వింటారు. వృత్తి నిపుణులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్వల్చ్బ అనారోగ్యం సంభవం. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.