మేష రాశి (Aries): వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. శుభవార్తలు వింటారు. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభ రాశి (Taurus): ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. దగ్గర బంధువొకరికి సహాయపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
మిథున రాశి (Gemini): ఉద్యోగంలో ఎవరి సహకారమూ లేకుండా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కర్కాటక రాశి (Cancer): ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.
సింహ రాశి (Leo): ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. శుభవార్త వింటారు.
కన్య రాశి (Virgo): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకోకుండా ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
తుల రాశి (Libra): ఉద్యోగంలో సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక ప్రధాన ఆర్డిక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి (Scorpio): ఉద్యోగం మారాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి (Sagittarius): ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ఆశాజనంకంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొ౦టాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
మకర రాశి (Capricorn): ఉద్యోగంలో అధికారుల అభినందనలు, ప్రశంసలు అందుకుంటారు. అధికార లాభం ఉంది. ఆర్థిక స్తోమత చాలా వరకు మెరుగుపడుతుంది. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
కుంభ రాశి (Aquarius): ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
మీన రాశి (Pisces): ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్దికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.