Today Horoscope: నేటి రాశి ఫలాలు. ఇవాళ కొన్ని రాశుల వారికి సంతోషంగా గడుస్తుంది. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. మరికొందరు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రతి దానికీ తిప్పట ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో మోస పోయే ప్రమాదం ఉంది. మరి మేషం నుంచి మీనం వరకు ఇవాళ రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి (Aries): ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరిగినా అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో పట్టుదలకు పోవద్దు. కళా సాహిత్య రంగాల్లోనివారు రాణిస్తారు.
వృషభ రాశి (Taurus): ఉద్యోగం మారాలన్న ప్రయత్నం సఫలమవుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ప్రతి దానికీ కాస్తంత తిప్పట తప్పదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు అన్నివిధాలా బాగుంది.
మిథున రాశి (Gemini): ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొందరు బంధుమిత్రులు సహాయపడతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్దులు కష్టపడాల్సి ఉంటుంది. చిన్న ప్రయత్నంతో వివాహ సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి వారికి బాగుంది.
కర్కాటక రాశి (Cancer): కోర్టు కేసులో అనుకోకుండా విజయం సాధిస్తారు. డబ్బు కలిసి వస్తుంది. పరిచయస్తులతో పెళ్లి ప్రయతం ఫలించవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
సింహ రాశి (Leo): సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. గతంలో మీరు ఆదుకున్నవారు ఇప్పుడు మీకుసహాయం చేస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయానికి కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్దులు తేలికగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి.
కన్య రాశి (Virgo): ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి శుభవార్త వింటారు. ఒక పాత ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. తిప్పట ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అవివాహితులకు పెళ్లి గంట మోగుతుంది. కొద్దిగా డబ్బు నష్టం జరగవచ్చు.స్నేహితుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
తుల రాశి (Libra): ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. సమీప బంధువులకు ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త ఇంటా బయటా శ్రమ బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. శరీరానికి విశాంతి అవసరం.
వృశ్చిక రాశి (Scorpio): ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ఇంట్లో శుభకార్యం తల పెడతారు. ఉద్యోగం ఆందోళనకరంగా సాగిపోతుంది. భార్యాపిల్లల సహకారం ఉంటుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కోపతాపాలకు ఇది ఏమాత్రం సమయం కాదు. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభించవు.
ధనస్సు రాశి (Sagittarius): ఆదాయం పెరిగినా ఇంటి ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో పై అధికారులు వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. వ్యాపారంలో లాభాలు తగ్గవచ్చు. ప్రేమ వ్యవహారం మందకొడిగా నడుస్తుంది.
మకర రాశి (Capricorn): అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్నప్పటి స్నేహితులతో పార్టీ చేసుకుంటారు. ఇంట్లో శుభకార్యం తల పెడతారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి అనుకూల సమాచారం అందుతు౦ది. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు.
కుంభ రాశి (Aquarius): ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. తలచిన పనులు చాలావరకు నెరవేరతాయి. పలుకుబడి పెరుగుతుంది. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.
మీన రాశి (Pisces): వృత్తికి సంబంధించి మీ కలలు ఫలించే సమయం ఇది. తలచిన పనులు చాలావరకు నెరవేరతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చక్కటి పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పరుగుతుంది.