వృషభ రాశి (Taurus): ఆదాయం నిలకడగా ఉన్నా, ఆచితూచి ఖర్చు చేయడం చాలా మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దేవుడి మీద భక్తి బాగా పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. (ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.
వృశ్చిక రాశి (Scorpio): ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా సత్ఫలితాన్నిస్తుంది. కొందరు స్నేహితులతో చిన్ననాటి సంగతులు నెమరువేసుకుంటారు. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. విదేశాల్లో ఉద్యోగం కోస౦ ఎదురు చూస్తున్న మీ అబ్బాయికి మంచి సమాచారం అందుతుంది. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు సిద్దిస్తాయి.
ధనస్సు రాశి (Sagittarius): వ్యాపారులకు నిలకడగా లాభాలు కొనసాగుతాయి. ఉద్యోగంలో పై అధికారులు ఎంతగానో ప్రోత్సహిస్తారు. అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుక్కోవాలని గట్టి నిర్ణయానికి వస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి నిపుణులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
మకర రాశి (Capricorn): దేవుడు మీ వైపే ఉన్నాడని మీకు అర్ధమవుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. బంధుమిత్రుల్లో పలుకుబడి పెరుగుతుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వీసా సమస్య పరిష్కారం అవుతుంది.మీ ఆస్తి విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితంబాగుంటుంది.
కుంభ రాశి (Aquarius): ఉద్యోగ జీవితం చాలావరకు బాగానే సాగిపోతుంది. కొద్దిగా నలతగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. జేబు నిండుగా ఉంటుంది. వ్యాపారులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు యుగళ గీతంలోకి దిగుతాయి. ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. హామీలు ఉండవద్దు.
మీన రాశి (Pisces): కొందరు బంధువులు ఇబ్బందులకు గురి చేస్తారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచండి. విహారయాత్రకు వెళ్లడం ఉత్తమం. ప్రతి పనికీ బాగా చెమటోడ్చాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్‌కు వీలైనంత దూరంగా ఉండండి. వ్యాపారులకు కొద్దిగా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురు దెబ్బలు తగలవచ్చు.