మేష రాశి (Aries): గ్రహ సంచారం ప్రకారం చాలా మంచి కాలం నడుస్తోంది. విజయాలు, సాఫల్యాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ రాణిస్తారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు.
వృషభ రాశి (Taurus): గ్రహ గతులు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తే పనులన్నీ పూర్తవుతాయి. సరైననిర్ణయాలు తీసుకుంటే మీ కోరికలు తీరతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసి వస్తుంది. అవనరాలకు ధనం అందుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. మితిమీరిన ఖర్చుకు కళ్లెం వేయాలి. పెళ్ళి సంబంధం కుదురుతుంది.
మిథున రాశి (Gemini): ఆర్థికంగా కొద్దిపాటి అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మితిమీరిన ఔదార్య౦ కారణంగా ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారపరంగా తగిన జాగ్రత్తలు అవసరం. శుభవార్త వింటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్యం సంభవం.
కర్కాటక రాశి (Cancer): మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు మెరుగ్గా ఉంది.
సింహ రాశి (Leo): రాదనుకున్న బకాయి చేతికి అందుతుంది. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగపరంగా బాగా కష్టపడాల్సి వస్తుంది. మిత్రులు, స్నేహితురాలి ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. అప్పు చేయవద్దు.
కన్య రాశి (Virgo): గ్రహ గతి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కలిసొచ్చే కాలం. తలపెట్టిన పనులు సఫలమవుతాయి.అందువల్ల మేలైన భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుంచి అభినందనలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు.
తుల రాశి (Libra): అనుకున్న పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపార లాభముంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్ణయాలు తీసుకోండి. కుటుంబపరంగా సహాయ సహకారాలులభిస్తాయి. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్ధులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio): కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. అనేక విధాలుగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. భూ, గృహ లాభాల మీద దృష్టి సారిస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. విద్యార్ధులకు పరవాలేదు.
ధనస్సు రాశి (Sagittarius): సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చు. ఆస్తి అభివృద్ధి చెందే నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు లాభిస్తాయి.
మకర రాశి (Capricorn): ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగ జీవితంలోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ అనేక అవరోధాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత కృషి అవసరం. బంధువుల్లో మిమ్మల్ని అవమానించే వారుంటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు శమ పడాల్సి ఉంటుంది. డబ్బు తీసుకోవద్దు, ఇవ్వొద్దు.
కుంభ రాశి (Aquarius): అసంపూర్తిగా ఉండిపోయిన పనులు పూర్తి చేసారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయమూ కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శమ ఎక్కువవుతు౦ది. రుణాల నుంచి కొద్దిగా బయటపడతారు. ఇరుగు పొరుగుతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.