ధనస్సు రాశి (Sagittarius):ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు తెలుస్తుంది. తెలిసినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సత్సలితాలనిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు.
మకర రాశి (Capricorn): ముఖ్యమైన పనుల్లో కొన్నిటిని శ్రమ మీద పూర్తి చేస్తారు. పరిస్థితులు వ్యతిరేకంగా కనిపించినా పట్టుదలగా ముందడుగు వేయండి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. సన్నిహితుల సూచనలు కూడా అవసరం అని గ్రహించండి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం ఆఫర్ వస్తుంది.