మేష రాశి (Aries): మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు కూడా వర్తిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి పెళ్లి, ఉద్యోగం, ఆర్థిక స్థితిగతుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలున్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దగ్గర బంధువొకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది.
వృషభ రాశి (Taurus): జీవితం మంచి మలుపు తిరుగుతుంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్సలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు కానీ బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలాకాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీల వల్ల చక్కని ప్రయోజనాలు పొందుతారు.
మిథున రాశి (Gemini): ఆకస్మిక ధనలాభానికి, కొద్దిపాటి అదృష్టానికి అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బాగా దూర ప్రాంతంలో ఉన్నవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మొత్తం మీద అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. పాజిటివ్‌గా ఆలోచించండి. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం మీరు గతంలో మీరు చేసిన ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకాలేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు అనుకోకు౦డా చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా అంతిమంగా దాని వల్ల ప్రయోజనం పొందుతారు.
కర్కాటక రాశి (Cancer): ఆర్థికంగా కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. అయితే, ఇంటా బయటా బాగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. బంధువుల్లో కొందరు దుష్ప్రచారం సాగించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆపర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూడడం మానుకోవాలి.
సింహ రాశి (Leo): గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. తానొకటి తలిస్తే వైవమొకటి తలిచాడు అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు పెరిగి డబ్బు కోసం ఇబ్బంది పడడం జరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను, అనుభవాన్ని అధికారులు గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. కొద్దిగా రుణ భారం తగ్గుతుంది. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న స౦తానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కొద్దిగా ఫలిస్తాయి. కొందరు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది.
కన్య రాశి (Virgo): మంచి కాలం నడుస్తొంది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు సత్ప్సలితాలనిస్తాయి. ఏ విధంగా చూసినా అంతా మంచే కనిపిస్తోంది. ఉద్యోగంలో అధికార హోదా లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలుతీసుకునే ముందు పెద్దలతో సంప్రదించండి. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
తుల రాశి (Libra): మీ ప్లాన్లు ఆలోచనలు సాకారం కావడానికి మరి కొంత కాలం పడుతుంది. శ్రమ, తిప్పట లేకుండా ఏపనీ పూర్తి కాదు. వీటికి కొన్ని డబ్బు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కూడా తోడవుతాయి. అంతమాత్రాన నిరాశ చెందవద్దు. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
వృశ్చిక రాశి (Scorpio): తిప్పట ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అవసరానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం అ౦దుతూ ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగంలభించే అవకాశం ఉంది. డాక్టర్లు లాయర్లు స్వయం ఉపాధివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.
ధనస్సు రాశి (Sagittarius): అదనపు ఆదాయం కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. మీ కలలు సాకారమయ్యే సమయం ఇది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. గతంలో మీ దగ్గర డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఉద్యోగంలో అధికార లాభానికి అవకాశం ఉంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పిల్లలు పురోగతి చె౦దుతారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు.
మకర రాశి (Capricorn): తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అనే సూక్తి ఈ వారం మీకు పూర్తిగా వర్తిస్తుంది. వృథా పనుల మీద డబ్బు ఇబ్బడిముబ్బడిగా ఖర్చవుతుంది. అదనపు ఆదాయం కోసం క్షణం తీరిక లేకుండా శ్రమపడాల్సి వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి శ్రమకు గురవుతారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల పట్ట అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువుల ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు. తోబుట్టువులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius): ఏలిన్నాటి శని కారణంగా ఏ పనీ ఒక పట్టాన సమయానికి పూర్తి కాదు. శ్రమ, తిప్పట తప్పవు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలను కొద్ది కాలం పాటు వాయిదా వేయడం మంచిది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో త్వరలో స్థిరత్వం లభిస్తుంది. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల పురోగతి గురించి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబానికి సంబంధి౦చి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కొద్దిపాటి అభివృద్దికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చి౦తన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సహాయపడతారు.
మీన రాశి (Pisces): విలాసవంతమైన జీవితానికి బాగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. కాస్తంత ప్రాక్టికల్‌గా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయవద్దు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికాంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరి కొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. ఓ వ్యక్తిగత స మస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.