మిథున రాశి (Gemini): గ్రహ సంచారం కొద్దిగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకే కాదు, నిరుద్యోగులకు కూడా సమయం అ నుకూలిస్తుంది. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటక రాశి (Cancer): ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఆర్టించే అవకాశం ఉంది. కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మిత్రుల వల్ల నష్టపోతారు.
సింహ రాశి (Leo): ఆశించినంతగా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు అర్జిస్తారు.
తుల రాశి (Libra): ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. సమయం కొద్దిగా అనుకూలంగా ఉంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కాస్తంత అభివృద్ధి సాధిస్తారు.
ధనస్సు రాశి (Sagittarius): ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. అనారోగ్యం నుంచి ఊరట లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ప్రేమించినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు.
కుంభ రాశి (Aquarius): ఉద్యోగులకు అధికార యోగం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. జీవితానికి సంబంధించి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్పలితాలనిస్తాయి. సంతానం పురోగతి చెందుతారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలార్జిస్తారు.
మీన రాశి (Pisces): ఉద్యోగంలో శ్రమ ఎక్కువైనా సత్ఫలితాలు సాధిస్తారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి అభివృద్ధి కనిపిస్తోంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. ఒక వ్యక్తిగత సమస్యను తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. వ్యాపారులు ఎంతో శ్రమ మీద కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు.