మేష రాశి (Aries): ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో స్థానచలనానికి అవకాశం ఉంది. అదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. అనుకోకుండా పెళ్ళి సంబంధం కుదరవచ్చు. ఆరోగ్యం పరవాలేదు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీస్తుంది. బంధువులకు సహాయం చేస్తారు.
వృషభ రాశి (Taurus): ఆదాయంలో అభివృద్ది ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వైద్య ఖర్చులకు కళ్లెం పడుతుంది. ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వయం ఉపాధివారికి, కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు.
మిథున రాశి (Gemini):దీర్ఘకాలం౦గా చికాకు పెడుతున్న కొన్ని డబ్బు ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితులు అపార్థం చేసుకునే సూచనలున్నాయి. కుమార్తెకు పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. బంధువులతో కాలక్షేపం చేస్తారు.
కర్కాటక రాశి (Cancer): ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఇంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం బాగుంది. చిన్న వ్యాపారులకు అన్నివిధాలా బాగుంది. పెళ్లి సంబంధం పెండింగ్లో పడుతుంది.
సింహ రాశి (Leo): నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. రుణ సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి.
కన్య రాశి (Virgo): ఉద్యోగంలో మీ ప్రాభవం, ప్రాబల్యం బాగా పెరుగుతాయి. ఇష్టమైన చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. పెళ్లి నుంచి అనుకున్న స్పందన లభించకపోవచ్చు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. దూరపు బంధువులు కలిసే అవకాశం ఉంది. వ్యాపారులు, స్వయం ఉపాధివారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
తుల రాశి (Libra): ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి నిపుణులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారులు శక్తికి మించి శ్రమపడాల్సి ఉంటు౦ది. దగ్గరి బంధువులకు సహాయం చేస్తారు.
వృశ్చిక రాశి (Scorpio): ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తిప్పట ఎక్కువగాఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యాపారులకు శ్రమ మిగులుతుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
ధనస్సు రాశి (Sagittarius): ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. వ్యాపారులు సునాయాసంగా ఆదాయం పెంచుకుంటారు. అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius): ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. అధికారులు లేదా సహోద్యోగులు అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. అదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆదాయం పెంచుకునే మార్గం ఆలోచిస్తారు. కుమారుడికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశ౦ ఉంది. వ్యాపారులు పురోగతి సాధిస్తారు.
మీన రాశి (Pisces): ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలు గుర్తించి అధికారులు ప్రోత్సహిస్తారు. వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి సమయం అనుకూలంగా ఉంది. బంధువర్గంలో మంచి పెళ్ళి సంబంధం కుదిరే అవకాశం ఉ౦ది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు.