వృషభ రాశి (Taurus): ఆశించిన స్థాయిలో కాలం సహకరించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ తీసుకుని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల వల్ల శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబంలో కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీ నుంచి ఆర్థిక సహాయం అందుకున్నవారు మీకు బాకీ తీరుస్తారు. మీ ప్రయత్నాలు త్వరలో సత్ఫలితాలనిస్తాయి.
మిథున రాశి (Gemini):శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ ఒక పథకం ప్రకారం పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని మంచి పనులు చేసి మెప్పుపాందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు చవిచూస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆవేశకావేషాలను అదుపులో ఉంచుకోండి. ఉన్న ఊళ్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి (Cancer): ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అధికారుల ద్వారా ఉద్యోగంలో ప్రయోజనం పొందుతారు. అందరికీ ఉపకరించే పనులు చేస్తారు. వ్యాపారంలో కొద్దిపాటి జాగ్రత్త అవసరం. మీ పనులకు ఇతరుల మీద ఆధారపడవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కన్య రాశి (Virgo): ఆటంకాలను అధిగమించి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతల మీద శ్రద్దపెట్టండి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఒకటి రెండు సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఓర్పు, సహనాలు అవసరం.
ధనస్సు రాశి (Sagittarius): గతంలో చేసిన ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం ఉంది. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. ఆదాయ౦ పెరిగి, రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. తెలిసినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
మకర రాశి (Capricorn): అనుకోని అదృష్ట యోగం ఉంది. తలచిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో విశేష ఫలితాలుంటాయి. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. కొన్ని అదనపు బాధ్యతలు మీద పడతాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు శత్రువులుగా మారి, విఘ్నాలు సృష్టిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
కుంభ రాశి (Aquarius): ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. సహోద్యోగులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో శ్రమ అధికమైనప్పటికీ సత్ఫలితాలనిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రయత్నాలు, నిర్ణయాలు ప్రయోజనం కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
మీన రాశి (Pisces): ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది కానీ చివరికి శుభమే జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పది మందికీ మేలు జరిగే పనులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.